
సీఎం కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తేలేదని.. ఇప్పుడే ధర్మయుద్దం మొదలైందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కరీంనగర్ జైలు నుంచి విడుదల అయ్యారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన బండి సంజయ్.. జైలుకెళ్లడం..తనకు బీజేపీ నేతలకు కొత్త కాదన్నారు. తాను జైలుకుపోవడం తొమ్మిదో సారి అన్నారు. ఎన్నికేసులైనా పెట్టుకో కానీ.. వెంటనే జీవో 317 సవరించాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు. 317 జీవో సవరించే వరకు పోరాటం ఆపబోమని... ఖబడ్దార్ కేసీఆర్ అంటూ హెచ్చరించారు. ఉద్యోగ సంఘాలు భయపడొద్దని.. బీజేపీ అండగా ఉంటుందన్నారు. తెలంగాన సమాజం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమన్నారు. అక్రమ కేసులకు భయపడబోమన్నారు. సీనియర్లు, జూనియర్లకు కొట్లాట పెట్టొద్దన్నారు. ప్రజల కోసం, అవసరమైతే మళ్లీ జైలుకెళ్తానన్నారు. తమ కార్యకర్తల కాళ్లు,చేతులు విరగొట్టారన్నారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా సీఎం కేసీఆర్ కు సిగ్గు లేదన్నారు. తమ పార్టీ ఆఫీస్ బద్దలు కొట్టడానికి ఎంత ధైర్యమన్నారు. తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ దోచుకుండన్నారు. దమ్ముంటే కేసీఆర్ ఉపాధ్యాయులతో మీటింగ్ పెట్టాలన్నారు. కేసీఆర్ వేల కోట్లు దోచుకున్నారన్నారు. కేసీఆర్ ను తెలంగాణ సమాజం చీదరించుకుంటుందన్నారు.