లిక్కర్ స్కాంపై కేసీఆర్ ఎందుకు స్పందిస్తలే

లిక్కర్ స్కాంపై కేసీఆర్ ఎందుకు స్పందిస్తలే

మునుగోడు ఉపఎన్నికతో తెలంగాణ భవిష్యత్తు ముడిపడి ఉందని బండి సంజయ్ అన్నారు. ఓటుకు 40వేలు చొప్పున ఇచ్చేందుకు టీఆర్ఎస్ సిద్ధమైందని ఆరోపించారు. దుబ్బాకలో 10 వేలు, హుజురాబాద్లో 20 వేలు పంచారని.. మునుగోడులో పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయని 40వేలు పంచడానికి సిద్ధమయ్యారన్నారు. నియోజకవర్గంలో వాళ్లకు అనుకూలంగా ఉన్న అధికారులను బదిలీ చేసుకున్నారని ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశాడనే భావన ప్రజల్లో ఉందని అన్నారు.

టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ వాళ్లు గెలిచినా మళ్లీ టీఆర్ఎస్ లోకే వెళ్తారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తున్నారని.. కేసీఆర్ ఏం చేసినా గెలుపు బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు.  సీఎం కేసీఆర్ లిక్కర్ కుంభకోణంలో తన బిడ్డ మీద వచ్చిన ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. చికోటి ప్రవీణ్ క్యాసినో కుంభకోణంపై కూడా స్పందించడం లేదని..కేసీఆర్ మౌనం స్కాంలను ఒప్పుకున్నట్టేనని చెప్పారు.