
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇవాళ కొల్లాపూర్ లో పర్యటించనున్నారు. కొల్లాపూర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఎల్లేని సుధాకర్ రావు గత నెల డిసెంబర్ 8వ తేదీ నుండి పాదయాత్ర చేపట్టారు. కొల్లాపూర్ ప్రగతి కోసం చిన్నంబావి మండలం మియాపూర్ గ్రామంలో ఈ పాదయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ పాదయాత్ర గత 35 రోజులుగా 110 గ్రామాలు,500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా కొల్లాపూర్ పట్టణంలో ఇవాళ పాదయాత్ర ముగింపు బహిరంగ సభను బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సభకు బండి సంజయ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
బండి సంజయ్ టూర్ షెడ్యూల్
బండి సంజయ్ 12:30 నిమిషాలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. శంషాబాద్ నుంచి కాన్వాయ్ లో నేరుగా కొల్లాపూర్ బయల్దేరి 3:30 నిమిషాల వరకు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా కొల్లాపూర్ మాధవస్వామి దేవాలయ సమీపంలోని వివేకానంద విగ్రహం వద్ద జరిగే జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. 4:10 నిమిషాలకు విగ్రహం దగ్గరి నుంచి పాదయాత్రలో పాల్గొని కొల్లాపూర్ లోని మెయిన్ రోడ్ ద్వారా 4:30 నిమిషాలకు బహిరంగ సభకు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు కొల్లాపూర్ లో బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.