బాసర ట్రిపుల్ ఐటీలో నాలుగో రోజు విద్యార్థుల ఆందోళన

బాసర ట్రిపుల్ ఐటీలో నాలుగో రోజు విద్యార్థుల ఆందోళన

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల నిరసన కంటిన్యూ అవుతోంది. నాలుగు రోజులుగా స్టూడెంట్స్ ఆందోళన చేస్తూనే ఉన్నారు. డిమాండ్లు నెరవేర్చే వరకు తమ నిరసన కొనసాగుతుందంటున్నారు స్టూడెంట్స్. అయితే విద్యార్థులకు మద్దతుగా బాసర ట్రిపుల్ ఐటీకి బయలు దేరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సమస్యలపై విద్యార్థులతో మాట్లాడనున్నారు. 

పొలిటికల్ లీడర్ల పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లే అన్ని రహదారుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. నేతలెవరూ క్యాంపస్ మెయిన్ గేటు దగ్గరకు వెళ్లకుండా కిలోమీటర్ దూరంలోనే పోలీసులు బారికేడ్లు పెట్టారు. విద్యార్థుల తల్లిదండ్రులను సైతం క్యాంపస్ మెయిన్ గేటు దగ్గరకు అనుమతించడం లేదు. అటు డైరెక్టర్ నియామకాన్ని స్వాగతించిన విద్యార్థులు.. రెగ్యులర్ వీసీ ని నియమించాల్సిందేనని చెప్తున్నారు. న్యాయమైన తమ 12 డిమాండ్లను నెరవేర్చాల్సిందేనంటున్నారు విద్యార్థులు. 

ట్రిపుల్ ఐటీవిద్యార్థుల ఆందోళనపై స్పందించారు రాహుల్ గాంధీ.. విద్యార్థుల వాస్తవ డిమాండ్లను సిల్లీ అనడం తెలంగాణ భవిష్యత్ పట్ల కేసీఆర్ ప్రభుత్వ విస్మయాన్ని కలిగిస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులు అందించిన ఎనలేని కృషిని సీఎం మర్చిపోయాడంటూ రాహుల్ ట్వీట్ చేశారు. బాసర ట్రిపుల్ ఐటీలో దయనీయ పరిస్థితులు ఉన్నాయన్నారు. అహంకారపూరిత కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థుల శక్తిని తక్కువగా అంచనా వేయొద్దని అన్నారు రాహుల్ గాంధీ.