
హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు. రెండు రోజుల పర్యటన నేపథ్యంలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సంజయ్ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై నడ్డాతో సంజయ్ చర్చించనున్నట్లుగా సమాచారం. దీంతో సంజయ్ పర్యటనపై ఆసక్తి నెలకొంది.