బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత

బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత

టెన్త్ హిందీ పేపర్ లీక్ వ్యవహారంలో.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ బెయిల్‌ రద్దుపై తీర్పు వెలువడింది. బండి సంజయ్ బెయిల్ ను రద్దు చేయాలని ఏప్రిల్ 17న పబ్లి్క్ ప్రాసిక్యూటర్ పిటిషన్ దాఖలు చేశారు.

బెయిల్ ఇచ్చిన టైంలో పోలీసులు చేసిన సూచనలు బండి సంజయ్ ఉల్లంఘించారని, విచారనకు సహకరించట్లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇరువైపు న్యాయవాదుల హన్మకొండ కోర్టుకు వాదనలు వినిపించారు. ఆ వాదనలను కొట్టేస్తున్నట్లు గురువారం (ఏప్రిల్ 27) కోర్టు తీర్పు ఇచ్చింది.