
సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ
మిగతా 63,425 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఎప్పుడు..?
ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష్యులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. మిగతా 63,425 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదల చేస్తారని లేఖలో ప్రశ్నించారు. బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రలో చాలా చోట్ల నిరుద్యోగ యువత పోస్టుల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యాని తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ఉద్యోగాల భర్తీ విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరు నీటి మీద రాతలుగా మిగిలిపోతున్నాయని లేఖలో బండి సంజయ్ మండిపడ్డారు.
కేవలం పోలీస్ శాఖలో రిక్రూట్ మెంట్ కు నోటిఫికేషన్ జారీ చేసి నిరుద్యోగ యువతకు ఎంతో మేలు చేశామని గొప్పలు చెప్పుకోవడం కాదు..? అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన మిగతా 63,425 పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేసే వరకు విద్యావంతులైన యువతకు తమ పార్టీ అండగా ఉంటుందని లేఖలో స్పష్టం చేశారు.
ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో ప్రకటన చేసి 45 రోజులు కావొస్తుందన్నారు. 16,614 పోలీసు పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్లు విడుదల చేశారని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 8ఏళ్లలో కేవలం పోలీసు పోస్టులను మాత్రమే భర్తీ చేస్తూ.. ఇతర ఉద్యోగ ఖాళీల భర్తీపై పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
మరిన్ని వార్తల కోసం..