సిట్ విచారణకు బండి సంజయ్ లీగల్ టీం

సిట్ విచారణకు బండి సంజయ్ లీగల్ టీం

టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ కేసులో  సిట్ నోటీసులకు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ రిప్లై ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల కారణంగా  సిట్ ముందు హాజరు కాలేకపోతున్నానని  చెప్పారు. తనకు సిట్ పై నమ్మకం లేదని బండి సంజయ్.. పేపర్ లీక్  కేసును తక్కువ చేసి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తనకు వచ్చిన సమాచారాన్ని బహిర్గతం చేయనని చెప్పారు. అసలు విషయంపై విచారణ జరపకుండా సిట్ అధికారులు తమకు నోటీసులిచ్చారని అన్నారు.  మార్చి 26న  సిట్ విచారణకు  బండి సంజయ్ లీగల్ టీం హాజరుకానుంది.

 మరో వైపు  పేపర్ లీకేజ్ కేసులో నలుగురు నిందితులను రెండోసారి కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ అధికారులకు  నాంపల్లి కోర్టు అనుమతి ఇచింది. ఏ -1 ప్రవీణ్, ఏ -2 రాజశేఖర్, ఏ -4 డాక్య, ఏ -5 కేతావత్ రాజేశ్వర్  ను కస్టడీకి తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. సిట్ అధికారులు మూడు రోజుల పాటు నలుగురు నిందితులను విచారించనున్నారు.