నువ్వు క్యూలో నిల్చునే రోజు వస్తుంది

నువ్వు క్యూలో నిల్చునే రోజు వస్తుంది

ఆకాశ్ పూరీ,  గెహనా సిప్పీ హీరోహీరోయిన్ లుగా జార్జిరెడ్డి ఫేమ్ జీవన్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా చోర్ బజార్. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రమోషన్స్ లో భాగంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న హైదరాబాద్ లో నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ లో దర్శకుడు పూరీని ఉద్దేశించి బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. 

ఈవెంట్ లో బండ్ల మాట్లాడుతూ.. ఎవరెవరినో స్టార్లను చేశావ్, డైలాగ్స్ రాని వారిని హీరోలుగా పెద్ద స్థాయిలో నిలుచోపెట్టావ్.. నీ కొడుకు విషయంలో మాత్రం ఇలా చేస్తున్నావ్.. నీ కొడుకు ఈవెంట్ కు కూడా రాకుండా ముంబయ్ లో కూర్చున్నావ్ అంటూ బండ్ల చురకలంటించారు. అంతేకాదు వ్యాంప్ లు వస్తుంటాయి పోతుంటాయి.. కానీ కుంటుంబం శాశ్వతం, నేను బ్రతికేది నా కుటుంబ కోసం, నా కొడుకుల కోసం, నా  కోసం. మనం ఏం చేసినా.. బిడ్డల కోసమే.. రేపు మనకు తలకొరికి పెట్టేది వాళ్లే.. మనం ఆస్తులు సంపాదించినా.. వాళ్ళ కోసమే.. అప్పులు చేసినా తీర్చేది వాళ్లే.. అంటూ పూరీని  ఉద్దేశించి కామెంట్స్ చేశారు బండ్ల. 

ఇక ఆకాశ్ పూరీ లో ఓ స్టార్ ఉన్నాడు. యాక్టింగ్ ఇరగదీస్తాడు. ఎవరెవర్నో స్టార్లను చేస్తున్నావ్.. నీ కొడుకుని మాత్రం పట్టించుకోవడంలేదు.  చూస్తూ ఉండు.. నీ కొడుకు కోసం కథ రాసి.. వాడి డేట్ల కోసం నువ్వు క్యూలో నిల్చునే రోజు వస్తుంది అంటూ బండ్ల గణేష్ మాట్లాడారు.