షాద్ నగర్ నుంచి తిరుమలకు బండ్లగణేశ్ పాదయాత్ర

షాద్ నగర్ నుంచి తిరుమలకు బండ్లగణేశ్ పాదయాత్ర

నిర్మాత,నటుడు బండ్ల గణేష్   షాద్ నగర్ నుంచి  తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు.   రంగారెడ్డి జిల్లా షాద్ నగర్  పట్టణంలోని తన సినిమా థియేటర్ నుంచి   బండ్ల గణేష్ సంకల్ప యాత్ర పేరుతో తిరుమల తిరుపతి వెంకన్న సన్నిధికి పాదయాత్రను ప్రారంభించారు.

 ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బండ్ల గణేశ్ . వైఎస్సార్ సీపీ  ప్రభుత్వంలో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడంతో మనస్థాపానికి గురై  తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నానని చెప్పారు.  స్వామివారి దయతోనే చంద్రబాబు   జైలు నుంచి విడుదలవడమే కాకుండా  ఏపీలోని గత  ఎన్నికల్లో అత్యద్భుతమైన మెజారిటీతో గెలుపొంది ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ సంకల్పయాత్ర కేవలం తన మొక్కు కోసమేనని రాజకీయ లబ్ధి కోసం కాదన్నారు బండ్ల గణేశ్.