బండ్లన్న పొలిటికల్ రీఎంట్రీ.. మరి సెవెనో క్లాక్ బ్లేడ్ సంగతేంటి

బండ్లన్న పొలిటికల్ రీఎంట్రీ.. మరి సెవెనో క్లాక్ బ్లేడ్ సంగతేంటి

ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈమేరకు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టిన బండ్ల గణేష్.. "రాజకీయాలంటే నిజాయితీ. రాజకీయాలంటే నీతి. రాజకీయాలంటే కష్టం. రాజకీయాలంటే పౌరుషం. రాజకీయాలంటే శ్రమ. రాజకీయాలంటే పోరాటం. ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి, రావాలి. అందుకే వస్తా" అంటూ కీలక ప్రకటన చేసాడు.

అయితే బండ్ల గణేష్ ఈసారి ఏ పార్టీలోకి వెళ్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మళ్ళీ కాంగ్రెస్ లోనే చేరతారా లేక బీఆర్ఎస్ లోకి వెళ్తారా అనేది చూడాలి. ఇదిలా ఉంటే.. బండ్ల గణేశ్ ఇలా తన పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేసాడో లేదో.. అలా ఆయనపై ట్రోలింగ్ షురూ అయింది. "అన్నా, సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ కొనుక్కోమంటావా" అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

గతంలో తాను ఓడిపోతే సెవెనో క్లాస్ బ్లేడ్ తో కోసుకుంటూనంటూ బండ్ల చేసిన కామెంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అదే విషయాన్ని ఇప్పుడు మరోసారి గుర్తుచేస్తున్నారు నెటిజన్లు. మరి నెటిజన్స్ చేస్తున్న ఈ కామెంట్స్ పై బండ్లన్న ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.