రేవంత్ రెడ్డి టార్గెట్గా మాట్లాడకండి : బండ్ల గణేశ్

రేవంత్ రెడ్డి టార్గెట్గా మాట్లాడకండి : బండ్ల గణేశ్

కాంగ్రెస్ 55 మందితో  ఫస్ట్ లిస్ట్ రిలీజ్ కావడంతో చాలా చోట్ల అసంతృప్తి మొదలైంది. టికెట్ ఆశించి రాని వారు కొందరు రాజీనామా చేస్తుండగా..మరికొందరు ఆందోళన చేస్తున్నారు.  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అసెంబ్లీ టికెట్లు  అమ్ముకున్నారంటూ మరి కొందరు ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని పీసీసీ ఛీప్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాత బండ్ల గణేష్ రేవంత్ రెడ్డికి మద్దతుగా ట్వీట్ చేశారు.

అసెంబ్లీ ఎన్నికల విషయంలో  టీపీసీసీ చీఫ్ రేవంత్  రెడ్డి టార్గెట్  చేసి ఎవరూ మాట్లాడొద్దని  బండ్ల గణేష్   ట్వీట్ చేశారు. నాయకులకి చేతులెత్తి నమస్కరిస్తూ చెబుతున్న, పార్టీ పెద్దలు టికెట్లు కేటాయిస్తారని..ఈ విషయంలో  రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడకండి అని కోరారు.  ఈ సారి కాంగ్రెస్ పార్టీ గెలవాలి గెలిచి తీరాలి అన్న సంకల్పంతో ముందుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే  ఎన్నో పదవులు,ఎన్నో అవకాశాలు  ఎంతో సేవ చేసే భాగ్యం కలుగుతుందన్నారు. 

 బండ్లగణేశ్ కూకట్ పల్లి నుంచి పోటీ చేస్తారనే ఇటీవల ప్రచారం జరిగింది. అయితే తనకు టికెట్ ఇస్తానన్నారు కానీ..తాను పోటీ చేయబోనని క్లారిటీ ఇచ్చారు.