మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తా : ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

 మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తా : ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

గద్వాల, వెలుగు: గద్వాల మున్సిపాలిటీ అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ చైర్​ పర్సన్​ గా జయలక్ష్మి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మున్సిపల్ చైర్​ పర్సన్ కు, వైస్ చైర్​పర్సన్ శంకర్ ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బ్రాహ్మణులు, పాస్టర్లు, ముస్లిం మత పెద్దలు చైర్​ పర్సన్, వైస్ చైర్​ పర్సన్ ను ఆశీర్వదించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ గద్వాల మున్సిపాలిటీని ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. చైర్​ పర్సన్​ జయలక్ష్మి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మున్సిపల్ చైర్​పర్సన్ పదవి ఇచ్చిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.