రాజీవ్ స్వగృహ ఫ్లాట్లపై పబ్లిక్ ఇంట్రెస్ట్ .. పోచారంలో ఫ్లాట్ల వివరాలు తెలుసుకుంటున్న ప్రజలు

రాజీవ్ స్వగృహ ఫ్లాట్లపై పబ్లిక్ ఇంట్రెస్ట్ .. పోచారంలో ఫ్లాట్ల వివరాలు తెలుసుకుంటున్న ప్రజలు
  • ఈ నెల 30న బండ్లగూడ, వచ్చే నెల 1న పోచారం ఫ్లాట్స్ వేలం

హైదరాబాద్, వెలుగు: బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఫ్లాట్ల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్ కంటే దాదాపు 40 శాతం తక్కువ ధరలకే ఫ్లాట్లను అధికారులు వేలం వేయనున్నారు. దీంతో బండ్లగూడ, పోచారంలోని టవర్ల దగ్గరకు వచ్చి అధికారులను ఫ్లాట్ల వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. గత మూడ్రోజుల్లో సుమారు 2 వేల మంది వచ్చి ఎంక్వైరీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. నాగోల్ బండ్లగూడ ప్రాంతంలోని 159 ఫ్లాట్లకు, పోచారంలో 601 ఫ్లాట్ల విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 29 వరకు బండ్లగూడ, ఈ నెల 31 వరకు పోచారం ఫ్లాట్లకు డిపాజిట్ అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. 

సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ధర రూ.17 లక్షల నుంచి స్టార్ట్ అవుతుండగా, త్రిపుల్ బెడ్ రూమ్ డీలక్స్ ఫ్లాట్‌‌‌‌‌‌‌‌ రూ.50 లక్షలకు అందుబాటులో ఉందన్నారు. బండ్లగూడలో ఒక్క ఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌టీ ధర రూ.4-6 వేల వరకు పలుకుతుండగా, రాజీవ్ స్వగృహ ఫ్లాట్స్‌‌‌‌‌‌‌‌లో రూ.2,500 రూ.3 వేల లోపే ఉన్నాయని రాజీవ్ స్వగృహ జనరల్ మేనేజర్ భాస్కర్ రెడ్డి తెలిపారు. బండ్లగూడ ప్రాజెక్టుకు సంబంధించిన దరఖాస్తులను ఈ నెల 29 వరకు స్వీకరిస్తామని,30న లాటరీ ద్వారా కేటాయిస్తామని, పోచారం ప్రాజెక్టుకు సంబంధించిన దరఖాస్తులను ఈ నెల 31 వరకు స్వీకరిస్తామని, ఆగస్టు 1న లాటరీ ద్వారా కేటాయిస్తామని ఆయన వివరించారు.