బెంగళూరు: ఛేజింగ్‌లో కింగ్ కోహ్లీ (44 బాల్స్‌లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 81) మరోసారి బ్యాట్ ఝుళిపించడంతో ఐపీఎల్–19లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. దేవదత్ పడిక్కల్ (27 బాల్స్‌లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 55) కూడా అండగా నిలవడంతో.. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై గెలిచింది. టాస్ ఓడిన గుజరాత్ 20 ఓవర్లలో 205/3 స్కోరు చేసింది. సాయి సుదర్శన్ (28 బాల్స్‌లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 100) సెంచరీ సాధించాడు. తర్వాత బెంగళూరు 18.5 ఓవర్లలో 206/5 స్కోరు చేసింది. కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
బౌలర్లు ఫెయిల్..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ ఓపెనర్లు సుదర్శన్, గిల్‌ను కట్టడి చేయడంలో బెంగళూరు బౌలర్లు ఫెయిలయ్యారు. దాంతో తొలి ఓవర్‌లో ఫోర్‌తో మొదలైన సుదర్శన్ దూకుడు దాదాపు 16 ఓవర్ల పాటు కొనసాగింది. రెండో ఎండ్‌లో గిల్ కూడా ఉన్నంతసేపు వేగంగా ఆడాడు. మూడు, నాలుగు ఓవర్లలో నాలుగు ఫోర్లు కొట్టిన సుదర్శన్ ఐదో ఓవర్‌లో 4, 6, 4 దంచాడు. ఆరో ఓవర్‌లో గిల్ కూడా ఫోర్ కొట్టడంతో పవర్‌ప్లేలో 57/0 స్కోరు చేసింది.
8వ ఓవర్‌లో సుదర్శన్ 6, 4, 4తో 17 రన్స్ రాబట్టి 33 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 9, 10 ఓవర్లలో సుదర్శన్ 6, 6, 4తో ఫస్ట్ టెన్‌లో జీటీ 104/0తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ దశలో సిక్స్‌తో జోరు పెంచిన గిల్ స్ట్రయిక్ రొటేట్ చేశాడు. కానీ 13వ ఓవర్‌లో సుదర్శన్ సిక్స్ కొట్టగా నాలుగో బాల్‌కు గిల్ వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్‌కు 128 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఈ దశలో వచ్చిన బట్లర్ (25) కూడా బ్యాట్ ఝుళిపించాడు.
రెండో ఎండ్‌లో అదే జోరును కంటిన్యూ చేసిన సుదర్శన్ 4, 4, 6తో 57 బాల్స్‌లో సెంచరీ అందుకున్నాడు. 15 ఓవర్లలో స్కోరు 155/1కు చేరింది. 16వ ఓవర్‌లో హాజిల్‌వుడ్ (1/40) బౌలింగ్‌లో బట్లర్ ఫోర్ కొట్టినా.. మూడో బాల్‌కు సుదర్శన్‌ను ఔట్ చేశాడు. రెండో వికెట్‌కు 32 రన్స్ జతయ్యాయి. ఫోర్‌తో ఖాతా తెరిచిన సుందర్ (19 నాటౌట్) వేగంగా ఆడినా.. 18వ ఓవర్‌లో భువనేశ్వర్ (1/31) బట్లర్ వికెట్ తీశాడు. చివర్లో జేసన్ హోల్డర్ (23 నాటౌట్) 6, 6, 4తో ఆర్సీబీ స్కోరు రెండొందలు దాటింది.
కీలక భాగస్వామ్యం..
చేజింగ్‌లో బెంగళూరుకు ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలినా.. కోహ్లీ, పడిక్కల్ అద్భుతంగా ఇన్నింగ్స్ నిర్మించారు. తొలి ఓవర్‌లోనే కోహ్లీ సున్నా వద్ద ఇచ్చిన క్యాచ్‌ను సుందర్ డ్రాప్ చేశాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో జాకబ్ బెథెల్ (14)ను సిరాజ్ (1/25) ఔట్ చేశాడు. 26/1 వద్ద వచ్చిన పడిక్కల్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. 4, 4, 6తో విరాట్ టచ్‌లోకి రాగా, పడిక్కల్ 4, 6తో సిరాజ్‌ను ఉతికాడు.
దాంతో పవర్‌ప్లేలో ఆర్సీబీ 58/1 స్కోరు చేసింది. ఫీల్డింగ్ పెరిగిన తర్వాత ఈ ఇద్దరు మరింత దూకుడుగా ఆడారు. 7, 8వ ఓవర్లలో కోహ్లీ 4, 4, 6, 4 కొడితే.. 9వ ఓవర్‌లో పడిక్కల్ 4, 6, 6తో 19 రన్స్ దంచాడు. రషీద్ వేసిన పదో ఓవర్‌లో పడిక్కల్ 6, 6తో 20 బాల్స్‌లోనే ఫిఫ్టీ అందుకున్నాడు. తొలి పది ఓవర్లలో స్కోరు 118/1కి చేరింది. 11వ ఓవర్‌లో కోహ్లీ 4, 6తో 30 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
రెండో వికెట్‌కు 115 రన్స్ జత చేసి జోరుమీదున్న ఈ జంటను 13వ ఓవర్‌లో రషీద్ విడగొట్టాడు. అద్భుతమైన గూగ్లీతో పడిక్కల్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. 14వ ఓవర్‌లో బ్యాక్ టు బ్యాక్ సిక్స్‌లు కొట్టిన కోహ్లీ.. హోల్డర్ (1/35) బాల్‌ను వికెట్ల మీదకు ఆడి వెనుదిరిగాడు. ఆరు బాల్స్ తేడాలో రెండు కీలక వికెట్లు పడటంతో ఆర్సీబీ స్కోరు 154/3 అయ్యింది. అయితే ఇక్కడి నుంచి జీటీ బౌలర్లు పుంజుకున్నారు.
15వ ఓవర్‌లో రజత్ పటీదార్ (8) సిక్స్‌తో కుదురుకున్నా.. జితేష్ శర్మ (10) సిక్స్ కొట్టి వికెట్ ఇచ్చాడు. తర్వాతి ఓవర్‌లో పటీదార్‌ను కూడా వెనక్కి పంపడంతో స్కోరు 173/5గా మారింది. ఇక 24 బాల్స్‌లో 31 రన్స్ చేయాల్సిన దశలో టిమ్ డేవిడ్ (10 నాటౌట్), క్రునాల్ పాండ్యా (23 నాటౌట్) 6, 4, 4, 6, 4తో ఈజీగా విజయాన్ని అందించారు.
సంక్షిప్త స్కోర్లు
గుజరాత్: 20 ఓవర్లలో 205/3 (సుదర్శన్ 100, గిల్ 32, భువనేశ్వర్ 1/31). బెంగళూరు: 18.5 ఓవర్లలో 206/5 (కోహ్లీ 81, పాండ్యా 23*, రషీద్ 2/49).
ఐపీఎల్‌లో వేగంగా 2 వేల రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా సాయి సుదర్శన్ (47 ఇన్నింగ్స్).. క్రిస్ గేల్ (48 ఇన్నింగ్స్) రికార్డును బ్రేక్ చేశాడు. ఐపీఎల్‌లో వరుసగా మూడు సీజన్లలో సెంచరీలు కొట్టిన తొలి ఇండియన్ బ్యాటర్ సాయి సుదర్శన్. 2011–13లో గేల్ ఈ రికార్డును సృష్టించాడు.

