ఆసియా కప్‎కు‎ బంగ్లాదేశ్ టీమ్ ప్రకటన.. మాజీ కెప్టెన్ శాంటోకు జట్టులో దక్కని చోటు

ఆసియా కప్‎కు‎ బంగ్లాదేశ్ టీమ్ ప్రకటన.. మాజీ కెప్టెన్ శాంటోకు జట్టులో దక్కని చోటు

ఢాకా: 2025, సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్-2025కు బంగ్లాదేశ్ తమ జట్టును ప్రకటించింది. మొత్తం 16 మందితో టీమ్‎ను అనౌన్స్ చేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. స్టార్ బ్యాటర్ లిట్టన్ దాస్ ఈ టోర్నీలో బంగ్లాదేశ్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఆసియా కప్ జట్టులో పలువురు స్టార్ ప్లేయర్లకు షాకిచ్చింది బంగ్లా క్రికెట్ బోర్డు. బంగ్లాదేశ్ మాజీ టీ20 కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో ఆసియా కప్‎కు ఎంపిక కాలేదు. ఫామ్ లేమి కారణంగా శాంటోను పక్కకు పెట్టారు. 

వికెట్ కీపర్ నూరుల్ హసన్ మూడు సంవత్సరాల తర్వాత టీ20 జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అలాగే ఆల్ రౌండర్ సైఫ్ హసన్ కూడా ఏడాదిన్నర విరామం తర్వాత టీ20 జట్టులోకి పునరాగమనం చేశాడు. టీ20ల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోవడంతో స్టార్ ప్లేయర్ మెహిదీ హసన్ మిరాజ్ కూడా ఆసియా కప్ జట్టులో తన స్థానాన్ని కోల్పోయాడు. మెహిదీ, సౌమ్య సర్కార్, తన్వీర్ ఇస్లాం, హసన్ మహమూద్ వంటి బడా ప్లేయర్లు కూడా స్టాండ్‌బై జాబితాకు పరిమితమయ్యారు. 

►ALSO READ | US Open 2025: యుఎస్ ఓపెన్ డ్రా రిలీజ్.. అందరి చూపు ఆ ముగ్గురిపైనే.. తొలి రౌండ్‌లోనే జొకోవిచ్‌కు టఫ్ ఫైట్

2025, సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 మొదలు కానుంది. ఆసియా 2025లో మొత్తం ఎనిమిది జట్లు పోటీలో ఉండగా..  బంగ్లాదేశ్ గ్రూప్ Bలో ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, హాంకాంగ్‌లతో తలపడనుంది. సెప్టెంబర్ 11న అబుదాబిలో హాంకాంగ్‌తో బంగ్లా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. గ్రూప్‌‌‌‌‌‌‌‌–ఎలో  ఇండియా, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్‌‌‌‌‌‌‌‌.. గ్రూప్‌‌‌‌‌‌‌‌–బిలో శ్రీలంక, అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌, బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌, హాంకాంగ్‌‌‌‌‌‌‌‌ బరిలో నిలిచాయి. దుబాయ్‌‌‌‌‌‌‌‌, అబుదాబి వేదికలుగా ఓవరాల్‌‌‌‎గా 19 మ్యాచ్‌‎లు జరుగుతాయి.  

ఆసియా కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు: లిట్టన్ కుమార్ దాస్ (కెప్టెన్), తాంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, సైఫ్ హసన్, తౌహిద్ హృదయ్, జాకర్ అలీ అనిక్, షమీమ్ హొస్సేన్, క్వాజీ నూరుల్ హసన్ సోహన్, షాక్ మహేదీ హసన్, రిషాద్ హుమ్మెద్, ముస్త్ అహ్మద్ , తాంజిమ్ హసన్ సాకిబ్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, షైఫ్ ఉద్దీన్

స్టాండ్‌బై (ఆసియా కప్‌కు మాత్రమే): సౌమ్య సర్కార్, మెహిదీ హసన్ మిరాజ్, తన్వీర్ ఇస్లాం, హసన్ మహమూద్