
టెన్నిస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న యూఎస్ ఓపెన్ డ్రా వచ్చేసింది. ఆదివారం (ఆగస్టు 24) నుంచి మొదటి రౌండ్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ గా వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ సిన్నర్ బరిలోకి దిగనున్నాడు. హార్డ్ కోర్ట్ లో తిరుగులేకుండా దూసుకెళ్తున్న సిన్నర్ మరో టైటిల్ పై కన్నేశాడు. 2024లో హార్డ్ కోర్ట్ లో జరిగిన రెండు గ్రాండ్ స్లామ్స్ టైటిల్స్ తో పాటు ఈ ఏడాది హార్డ్ కోర్ట్ లో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ ను సిన్నర్ కైవసం చేసుకున్నాడు. తిరుగులేని ఫామ్ లో ఉన్న ఈ ఇటలీ ప్లేయర్ హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగబోతున్నాడు.
తొలి రౌండ్ లో కోప్రివ్ తో సిన్నర్ టైటిల్ వేట ప్రారంభించనున్నాడు. జొకోవిచ్, అల్కరాజ్ లేకపోవడంతో తన డ్రా లో లేకపోవడంతో అలవోకగా ఫైనల్ కు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. సెర్బియా లెజెండ్ నోవాక్ జొకోవిచ్ 38 ఏళ్ళ వయసులో గ్రాండ్ స్లామ్ సాధించాలని ఆరాటపడుతున్నాడు. జొకోవిచ్ కు రెండేళ్లుగా గ్రాండ్ స్లామ్ టైటిల్ లేదు. ఎలాగైనా యూఎస్ ఓపెన్ గెలిచి తిరిగి పుంజుకోవాలని భావిస్తున్నాడు. తొలి రౌండ్ లోనే ఈ సెర్బియా స్టార్ కు కఠినమైన డ్రా ఎదురైంది. 19 ఏళ్ళ లెర్నర్ టియెన్‌తో తన తొలి మ్యాచ్ ఆడనున్నాడు. టియెన్ 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ నాలుగో రౌండ్ లో డేనియల్ మెద్వెదేవ్‌ను ఓడించాడు.
►ALSO READ | The Hundred 2025: అసాధ్యం అనుకుంటే అద్భుతం జరిగింది.. 29 బంతుల్లోనే 102 పరుగులు ఫినిష్
స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్‌తో రీల్లీ ఒపెల్కాతో తన తొలి మ్యాచ్ ఆడనున్నాడు. నాలుగో రౌండ్ లో 2021 ఛాంపియన్ డేనియల్ మెద్వెదేవ్ తో తలపడే అవకాశం ఉంది. ఇటీవలే టొరంటో టైటిల్ గెలిచి ఊపు మీదున్న బెన్ షెల్టన్ లేదా 2022 ఫైనలిస్ట్ కాస్పర్ రూడ్ లలో ఒకరితో క్వార్టర్ ఫైనల్స్ ఆడనున్నాడు. సెమీస్ లో జొకోవిచ్, ఫైనల్లో సిన్నర్ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. టేలర్ ఫ్రిట్జ్,అలెగ్జాండర్ జ్వెరెవ్, జాక్ డ్రేపర్,బెన్ షెల్టన్ తొలి గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ గెలవాలనే ఆశతో ఉన్నారు. 2014 ఛాంపియన్ మారిన్ సిలిక్ అలెగ్జాండర్ బుబ్లిక్‌తో తలపడనున్నాడు.