The Hundred 2025: అసాధ్యం అనుకుంటే అద్భుతం జరిగింది.. 29 బంతుల్లోనే 102 పరుగులు ఫినిష్

The Hundred 2025: అసాధ్యం అనుకుంటే అద్భుతం జరిగింది.. 29 బంతుల్లోనే 102 పరుగులు ఫినిష్

టార్గెట్ 40 బంతుల్లో 102 పరుగులు.. కొట్టాల్సిన రన్ రేట్ 15 ఉంది. క్రీజ్ లో పెద్దగా హిట్టింగ్ చేయలేని జోర్డాన్ కాక్స్, సామ్ కరణ్. ఇలాంటి పరిస్థుల మధ్య ఆ జట్టు గెలవడం దాదాపుగా అసాధ్యం. ఒకవేళ గెలిచినా చివరి వరకు మ్యాచ్ వెళ్లడం ఖాయం. కానీ హండ్రెడ్ లీగ్ లో సంచలనం చోటు చేసుకుంది. ట్రెంట్ రాకెట్స్ పై ఓవల్ ఇన్విన్సిబుల్స్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. చివరి 40 బంతుల్లో 102 పరుగులు చేయాల్సిన దశలో టార్గెట్ మరో 11 బంతులు మిగిలించి ఫినిష్ చేయడం హైలెట్ గా మారింది. జోర్డాన్ కాక్స్ (58), సామ్ కుర్రాన్ (54) ధాటికి ట్రెంట్ రాకెట్స్ బౌలర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. 

ఛేజింగ్ లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ కు మంచి ఆరంభం దక్కలేదు. మొదటి 60 బంతులు ముగిసేసరికి కేవలం 70 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఇక్కడ నుంచి అసలు విధ్వంసం మొదలైంది. 60 నుంచి 65 మధ్య 19 పరుగులు వచ్చాయి. కాక్స్ ఒక సిక్స్ కొడితే కరణ్ రెండు సిక్సర్లకు కొట్టాడు. ఆ తర్వాత సామ్ కుక్ వేసిన ఓవర్లో ఏకంగా 32 పరుగులు వచ్చాయి. అతను వేసిన 5 బంతుల్లో ఏకంగా 32 పరుగులు రావడంతో మ్యాచ్ ఒక్కసారిగా ఇన్విన్సిబుల్స్ వైపు మళ్లింది. రెండు 60 నుంచి 70 బంతుల మధ్య 51 పరుగులు రావడం విశేషం. స్టయినీస్ (81-85) వేసిన  ఓవర్లో 25 పరుగులు రావడంతో మ్యాచ్ పై ట్రెంట్ రాకెట్స్ ఆశలు వదిలేసుకుంది. 

►ALSO READ | Women's World Cup: చిన్నస్వామిలో వరల్డ్ కప్ మ్యాచ్‌లు లేవు.. వేరే స్టేడియానికి తరలించిన ఐసీసీ

87, 88 బంతులకు ఫోర్లు కొట్టి కాక్స్ జట్టుకు థ్రిల్లింగ్ విక్టరీ అందించాడు. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. రాకెట్స్ ఇన్నింగ్స్‌ను జో రూట్ (41 బంతుల్లో 76) టాప్ స్కోరర్ గా నిలిచాడు. లిండే 8 బంతుల్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్ తో 25 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. లక్ష్య ఛేదనలో ఓవల్ ఇన్విన్సిబుల్స్ మరో 11 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసి విజయం సాధించింది.