బంగ్లాదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు..యువత తిరుగుబాటు..షేక్ హసీన్ పదవీ కోల్పోయిన 18 నెలల తర్వాత జరుగుతున్న ఎన్నికలు..బంగ్లాదేశ్‌లో మొత్తం 300 పార్లమెంటు స్థానాలకు గాను 299సీట్లకు ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఒక స్థానంలో అభ్యర్థి చనిపోవడంతో అక్కడ ఎన్నికను వాయిదా వేశారు. షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత ఏర్పడిన నోబెల్ విజేత మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ ఎన్నికలను నిర్వహిస్తోంది.
హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ పోటీలో లేదు. అటు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఒకప్పటి మిత్ర పార్టీ జమాత్ ఏ ఇస్లామిలు మాత్రమే పోటీ చేస్తున్నాయి. దీంతో ఈ రెండు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ కచ్చితంగా ఉంటుందనేది విశ్లేషకులు అంటున్నారు. షేక్ హసీనా గద్దె దిగిన తర్వాత జరిగే మొదటి ఎలక్షన్ ఇదే.
ALSO READ : విద్యాంజలి అమలులో తెలంగాణ వెనుకబడింది
బంగ్లాదేశ్ ఏర్పాటు చేసిన అవామీ లీగ్ లేకుండానే తొలిసారి బంగ్లాదేశ్ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా తమకంటూ ఓ దేశాన్ని క్రియేట్ చేయడానికి పోరాడిన వారినే అక్కడ ప్రజలు తిరుగుబాటు చేయడం వెన్నుపోటు పొడవడమే అంటున్నారు అవామీ లీగ్ మద్దతుదారులు.
