బంగ్లాపై బహిష్కరణ వేటు.. టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో స్కాట్ లాండ్

బంగ్లాపై బహిష్కరణ వేటు..  టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో స్కాట్ లాండ్

న్యూఢిల్లీ: మూడు వారాల సస్పెన్స్‌‌‌‌‌‌‌‌కు తెరపడింది. వచ్చే నెలలో జరిగే టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ నుంచి బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తప్పించింది. భద్రతా కారణాల సాకుతో ఇండియాలో వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఆడేందుకు నిరాకరించిన బంగ్లాపై ఐసీసీ ఊహించినట్టుగానే బహిష్కరణ వేటు వేసింది. బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ) కోరినట్టు ఆ దేశ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లను శ్రీలంకకు తరలించడం సాధ్యం కాదని, అందుకే  ఫిబ్రవరి 7న మొదలయ్యే ఈ మెగా టోర్నీలో బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ జట్టును చేర్చినట్టు  శనివారం అధికారికంగా ప్రకటించింది. 

ఈ మేరకు  స్కాట్లాండ్‌‌‌‌‌‌‌‌ను టోర్నీలోకి ఆహ్వానించినట్టు అన్ని దేశాల బోర్డు సభ్యులకు పంపిన లేఖలో జై షా నేతృత్వంలోని ఐసీసీ పేర్కొంది.  ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ నుంచి ముస్తాఫిజుర్ రహమాన్‌‌‌‌‌‌‌‌ను బీసీసీఐ తప్పించిన తర్వాత ఇండియాలో బంగ్లా ఆటగాళ్ల భద్రతా ముప్పు ఎక్కువగా ఉందంటూ తమ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లను తటస్థ వేదికలకు మార్చాలని బీసీబీ పట్టుబట్టింది. ఐసీసీ భద్రతా నివేదికలో ముప్పు లేదని తేలినప్పటికీ, బీసీబీ మొండిగా వ్యవహరించి టోర్నీలో ఆడే చాన్స్ కోల్పోయింది.  ‘మెన్స్ టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో షెడ్యూల్ ప్రకారం ఆడేందుకు బంగ్లా బోర్డు ఒప్పుకోలేదు. కాబట్టి ఆ జట్టు ఈ టోర్నీలో ఉండదు. ఆ జట్టును తప్పించి ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో తర్వాతి స్థానంలో ఉన్న స్కాట్లాండ్‌‌‌‌‌‌‌‌ను టోర్నీలో చేర్చాం’ అని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది.   గ్రూప్-–సిలో బంగ్లాదేశ్ స్థానాన్ని స్కాట్లాండ్ తో భర్తీ చేసింది. ఫిబ్రవరి 7న కోల్‌‌‌‌‌‌‌‌కతాలో వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌తో జరిగే ఆరంభ మ్యాచ్‌‌‌‌‌‌‌‌తో స్కాట్లాండ్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది. ఆ తర్వాత ఇటలీ (9న), ఇంగ్లండ్ (14) ఈడెన్ గార్డెన్స్‌‌‌‌‌‌‌‌లోనే తలపడనున్న స్కాటిష్ టీమ్.. 17న  ముంబైలో నేపాల్‌‌‌‌‌‌‌‌తో  పోటీ పడనుంది. గత ఐసీసీ ఈవెంట్లలో స్కాట్లాండ్ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌, ప్రస్తుత ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌ (14వ స్థానం)  ఆధారంగా ఐసీసీ ఆ జట్టుకు ఈ అవకాశాన్ని కల్పించింది. తమకు వరల్డ్ కప్ చాన్స్ ఇచ్చిన ఐసీసీకి థ్యాంక్స్ చెప్పిన స్కాట్లాండ్ క్రికెట్ సీఈవో తమ టీమ్‌ ఇండియాకు వచ్చేందుకు రెడీ అవుతోందన్నాడు.  

బంగ్లా బోర్డుకు భారీ దెబ్బ

వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ నుంచి బహిష్కరణకు గురైన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆర్థికంగా భారీ మూల్యాన్ని చెల్లించుకోనుంది. 5 లక్షల డాలర్ల (సుమారు రూ.4.15 కోట్లు) పార్టిసిపేషన్ ఫీజును కోల్పోతుంది. ఐసీసీ నుంచి వచ్చే వార్షిక ఆదాయంలో సుమారు 27 మిలియన్ డాలర్లు (రూ. 247 కోట్లు) కూడా కోత పడే అవకాశం ఉంది. ఇది బీసీబీ ఆదాయంలో 60 శాతం.  కాగా, ఐసీసీ బోర్డు నిర్ణయాన్ని అంగీకరిస్తున్నామని బీసీబీ ప్రకటించింది. దీనిపై తాము ఎలాంటి అప్పీల్ చేయడం లేదని ఒక ప్రకటనలో తెలిపింది.

బంగ్లా బాటలో పాకిస్తాన్‌‌‌‌.. 

బంగ్లాదేశ్ బహిష్కరణ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌కు తమ జట్టును పంపే విషయంపై పునరాలోచన చేస్తామని పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ క్రికెట్ బోర్డు ( పీసీబీ) చైర్మన్ మోహ్‌‌‌‌సిన్ నఖ్వీ ప్రకటించాడు. బంగ్లాపై వేటు వేసిన ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని ఆరోపించాడు. ఇండో–-పాక్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల కోసం హైబ్రిడ్ మోడల్ పెట్టినప్పుడు బంగ్లాదేశ్ కోసం ఎందుకు పెట్టరని, ఒక దేశం (ఇండియా) చెప్పినట్లే ఐసీసీ నడుచుకుంటోందని విమర్శించాడు. పాక్ ఈ వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో ఆడుతుందా లేదా అనేది తమ దేశ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ నిర్ణయిస్తారని నఖ్వీ స్పష్టం చేశాడు. ప్రస్తుతం పీఎం విదేశీ పర్యటనలో ఉన్నారని, ఆయన రాగానే తుది నిర్ణయం తీసుకుంటామన్నాడు.