
- జలమార్గాలపై నిఘా,గస్తీ కోసం ఏర్పాటు
ఢాకా: సుందర్‌బన్స్‌లో బంగ్లాదేశ్ కొత్తగా ఫ్లోటింగ్ బార్డర్ అవుట్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసింది. భారత్‌తో సరిహద్దులోని రాయ్ మంగోల్ నది, బోయెసింగ్ కాలువ కూడలి వద్ద దీన్ని నిర్మించారు. ఈ ప్రాంతం ఢాకాకు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. నీటి మార్గాల్లో గస్తీ, నిఘా పెట్టడం లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్ (బీజీబీ) ఈ అవుట్‌పోస్ట్‌ను స్థాపించినట్టు ప్రస్తుత బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రభుత్వానికి సహాదారుగా ఉన్న ఆ దేశ మాజీ లెఫ్టినెంట్ జనరల్ జహంగీర్ ఆలం చౌదరి పేర్కొన్నారు.
ఇది బీజీబీ ఏర్పాటు చేసిన మూడో ఫ్లోటింగ్ అవుట్‌పోస్ట్. ఈ ప్రాంతంలో స్మగ్లింగ్, అక్రమ రవాణా, అటవీ సంపద దోపిడీని నిరోధించడం దీని ఉద్దేశంగా తెలిపారు. ఈ అవుట్‌పోస్ట్‌ను నారాయణగంజ్ డాక్‌యార్డ్‌లో తయారు చేశారు. బంగ్లాదేశ్, భారత్‌ల మధ్య ఉన్న 4,156 కిలోమీటర్లబార్డర్లో 180 కిలోమీటర్లు నదీ తీర సరిహద్దు ఉంది. సుందర్‌బన్స్‌లో 79 కిలోమీటర్ల బార్డర్ ఉంది. బోయెసింగ్ కాలువ ద్వారా స్మగ్లింగ్ జరుగుతోందని, దాన్ని అరికట్టడానికి ఈ అవుట్‌పోస్ట్ ఉపయోగపడుతుందని బీజీబీ చీఫ్ మొహమ్మద్ అష్రఫుజ్జమాన్ తెలిపారు.