హైదరాబాద్‌సిటీ, వెలుగు:- బంజారా భారత్ సర్వర్ణోత్సవాలు నవంబర్ 19 నుంచి 21 వరకు ఢిల్లీలో నిర్వహించనున్నట్టు బంజారాభారత్ అఖిల భారతీయ బంజారా మహా సేవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎంపీ ధారావత్ రవీంద్ర నాయక్ తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ దేశంలో 14 కోట్ల జనాభా కలిగిన బంజారా గిరిజన తెగ మాట్లాడే లిపిలేని బంజారా భాష ‘గోర్భోలి’ అన్నారు.
ఒకే సంస్కృతి సంప్రదాయాలు కలిగిన 16 ఉప నామాలు కలిగిన గ్వార్ బంజారా, సుగాలి బంజారా, లంబాడీ, లంబానీ బంజారా ,మారు బంజారాలకు దేశంలోని రెండు వందల పార్లమెంటు, వెయ్యి అసెంబ్లీ నియోజకవర్గాలను శాసించే బలం ఉందన్నారు. అంతటి శక్తి ఉన్న బంజారాలను ప్రభుత్వాలు రాజకీయంగా, ఆర్థికంగా పట్టించుకోవడం లేదన్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న టైంలో మహారాష్ట్రలో వీపీ నాయక్ మూడు సార్లు, సుధాకర్ నాయక్ ఒక సారి సీఎంలుగా చేసిన చరిత్ర ఉందన్నారు.
బంజారాల హక్కులు, రాజకీయంగా తమకు దక్కాల్సిన వాటాను సాధించేవరకు తమ పోరాటం ఉంటుందన్నారు. ఈ నెల 19 నుంచి ఢిల్లీలో నిర్వహించనున్న సభలో దీనిపై విస్తృత చర్చ ఉంటుందన్నారు
