రేపు బ్యాంకులు బంద్.. సెలవు ప్రకటించింది RBI.. ఎందుకంటే ?

రేపు బ్యాంకులు బంద్.. సెలవు ప్రకటించింది RBI..  ఎందుకంటే ?

ఈ నెల చివరిలో అలాగే వచ్చే నెల మొదటి వారంలో పండుగలు, సెలవులతో నిండి ఉంది. దింతో దసరా సెలవులు సందర్భంగా అన్ని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముందుగానే సెలవుల లిస్ట్ జారీ చేసింది, అయితే ఏ తేదీలో, ఏ నగరాల్లో బ్యాంకులు మూసి ఉంటాయో ఈ లిస్టులో తెలిపింది. కాబట్టి, మీరు బ్యాంకు పని మీద లేదా బ్యాంకుకి వెళ్లాల్సిన అవసరం ఉంటే, ముందుగా RBI సెలవుల లిస్ట్ చెక్ చేసుకోవడం మంచిది. 
 
ఈ మూడు నగరాల్లో బ్యాంకులు బంద్: సెప్టెంబర్ 29 సోమవారం రోజు అగర్తల, కోల్‌కతా, గౌహతిలలో బ్యాంకులు బంద్. ఈ నగరాలు కాకుండా దేశంలోని మిగిలిన అన్ని  ప్రాంతాలలో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి.

సెప్టెంబర్ 29న హాలీడేకి కారణం: మహా సప్తమి, దుర్గా పూజ కారణంగా RBI ఈ సెలవు ప్రకటించింది. మహా సప్తమి రోజున దుర్గాదేవి ఏడవ అవతారాన్ని పూజిస్తారు. కోల్‌కతా వంటి నగరాల్లో ఈ పండుగను గొప్ప భక్తి, భజన, ఆచారాలతో జరుపుకుంటారు, అందుకే బ్యాంకులు మూసివేయబడతాయి.

సెప్టెంబర్ 30న కూడా: సెప్టెంబర్ 30 అంటే మంగళవారం రోజున అగర్తల, భువనేశ్వర్, గౌహతి, ఇంఫాల్, జైపూర్, కోల్‌కతా, పాట్నా,  రాంచీలలో బ్యాంకులు మూసివేయబడతాయి. ఇతర నగరాల్లో బ్యాంకులు ఎప్పటిలాగే తెరిచి ఉంటాయి.