మీకు బ్యాంకుల్లో పని ఉందా..అకౌంట్ ఓపెన్ చేయడం కోసమో లేదా లోన్ కోసమో ఇతర పనులపై బ్యాంకులకు వెళ్తున్నారా..? అయితే ఇది గుర్తుంచుకోండి.. డిసెంబర్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు ఉన్నాయి. పండుగలు, జాతీయ, ప్రాంతీయ సెలవులతోపాటు వివిధ ఆచారాలకుసంబంధించిన రోజుల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు సెలవులు ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. డిసెంబర్ నెలలో మొత్తం నెలలో సగం రోజులకు పైనే సెలవు దినాలుగా ఆర్బీఐ ప్రకటించింది.
డిసెంబర్ 2024 లో శనివారాలు, ఐదు ఆదివారాలు కలుపుకొని మొత్తం17రోజులు సెలవులు ఉన్నాయి. కాబట్టి వాటికి అనుగుణంగా కస్టమర్లు ప్లాన్ చేసుకుంటే మంచిది.
డిసెంబర్ నెలలో బ్యాంకు లకు సెలవుల జాబితా ఇదే..
- డిసెంబర్ 1 - ఆదివారం (పాన్ ఇండియా)
- డిసెంబర్ 3 - మంగళవారం - సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ (గోవా) పండుగ
- డిసెంబర్ 12 - గురువారం పా-టోగన్ నెంగ్మింజా సంగ్మా (మేఘాలయ)
- డిసెంబర్ 14 - రెండో శనివారం (పాన్ ఇండియా)
- డిసెంబర్ 15 - ఆదివారం (పాన్ ఇండియా)
- డిసెంబర్ 18 - బుధవారం - యు సోసో థామ్ వర్ధంతి (మేఘాలయ)
- డిసెంబర్ 19 - గురువారం - గోవా విమోచన దినం (గోవా)
- డిసెంబర్ 22 - ఆదివారం (పాన్ ఇండియా)
- డిసెంబర్ 24 - మంగళవారం - క్రిస్మస్ పండుగ (మిజోరం, నాగాలాండ్ మరియు మేఘాలయ)
- డిసెంబర్ 25 - బుధవారం - క్రిస్మస్ (పాన్ ఇండియా)
- డిసెంబర్ 26 - గురువారం - క్రిస్మస్ వేడుకలు (మిజోరం, నాగాలాండ్ మరియు మేఘాలయ)
- డిసెంబర్ 27 - శుక్రవారం - క్రిస్మస్ వేడుకలు (మిజోరం, నాగాలాండ్, మేఘాలయ)
- డిసెంబర్ 28 - నాలుగో శనివారం (పాన్ ఇండియా)
- డిసెంబర్ 29 - ఆదివారం (పాన్ ఇండియా)
- డిసెంబర్ 30 - సోమవారం - యు కియాంగ్ నంగ్బా (మేఘాలయ)
- డిసెంబర్ 31 - మంగళవారం - నూతన సంవత్సర వేడుకలు / లోసాంగ్ / నమ్సోంగ్ (మిజోరాం, సిక్కిం)
బ్యాంకు సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి హాలిడే షెడ్యూల్ లేదా జాబితా కోసం మీ స్థానిక బ్యాంక్ శాఖను సంప్రదించడం ఉత్తమమని కస్టమర్లు గమనించాలి.