డెత్ మిస్టరీ: పబ్‎లోని లేడీస్ టాయిలెట్‎లో బ్యాంక్ మేనేజర్ శవం..

డెత్ మిస్టరీ: పబ్‎లోని లేడీస్ టాయిలెట్‎లో బ్యాంక్ మేనేజర్ శవం..

31 ఏళ్ల బ్యాంక్ మేనేజర్ పార్టీ చేసుకునేందుకు ఫ్రెండ్స్ కలిసి పబ్‎కు వెళ్లాడు. పబ్‏లో బీర్ తాగి ఫ్రెండ్స్‎తో ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత అందరూ కలిసి పబ్‎లోనే ఫుడ్ తిన్నారు. పబ్ క్లోజింగ్ టైమ్ కావడంతో బయటకు వెళ్తున్నారు. ఇంతలో తనకు వాంతులు వస్తున్నాయని వాష్ రూమ్‎కు వెళ్లాడు బ్యాంక్ మేనేజర్. కానీ ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అతని ఫ్రెండ్స్, పబ్ సిబ్బంది కలిసి వెతకగా.. పబ్‎లోని మహిళల టాయిలెట్‎లో అచేతనంగా పడి ఉన్నాడు బ్యాంక్ మేనేజర్. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పటి వరకు జాలీగా ఉన్న అతడికి సడెన్‎గా ఏమైంది..? లేడీస్ వాష్ రూమ్‎లోకి ఎందుకు వెళ్లాడు..? అనేది మిస్టరీగా మారింది. ఈ డెత్ మిస్టరీ కర్నాటక రాజధాని బెంగుళూర్‎లో జరిగింది. 

వివరాల ప్రకారం.. మండ్య జిల్లాలోని మద్దూర్‌కు చెందిన మేఘరాజ్ జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య ఆరు నెలల పాప ఉన్నారు. ఈ క్రమంలోనే గురువారం (అక్టోబర్ 9) రాత్రి ముగ్గురి ఫ్రెండ్స్‎తో కలసి పశ్చిమ బెంగళూరులోని రాజరాజేశ్వరినగర్‌లోని ఒక పబ్‌కు వెళ్లాడు మేఘానంద్. పబ్‎లో ఫ్రెండ్స్‎తో కలసి పార్టీ చేసుకున్నారు. మద్యం తాగి పబ్‎లోనే భోజనం చేశారు. 

అర్ధరాత్రి 12.45 గంటల ప్రాంతంలో పబ్ నుంచి బయటకు వెళ్తుండగా తనకు వాంతులు వస్తున్నాయంటూ అదరబాదరగా మేఘానంద్ వాష్ రూమ్‎కు పరిగెత్తాడు. వాంతులు వస్తున్నాయనే తొందర్లో అతడు జెన్స్ బదులు లేడీస్ వాష్ రూమ్‎లోకి వెళ్లాడు. ఎంతకీ వాష్ రూమ్ నుంచి రాకపోవడంతో మేఘానంద్ ఫ్రెండ్స్ పబ్ సిబ్బందికి సమాచారం అందించారు. పబ్ సిబ్బంది సీసీ కెమెరాలను పరిశీలించగా అతడు లేడీస్ టాయిలెట్‎లోకి వెళ్లినట్లు గుర్తించారు. వెంటనే వాష్ రూమ్ డోర్ తీసి చూడగా మేఘానంద్ అపస్మారక స్థితిలో కనిపించాడు. 

హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మేఘానంద్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుడి సోదరుడు వినయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజరాజేశ్వరీనగర్ స్టేషన్‌ పోలీసులు అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (పశ్చిమ) ఎస్ గిరీష్ మాట్లాడుతూ.. సీన్ ఆఫ్ క్రైమ్ ఆఫీసర్స్ (SOCO) బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించిందని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం తరలించామని.. ఫోరెన్సిక్ పరీక్షల కోసం విసెరా నమూనాలను సేకరించారని చెప్పారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ద్వారా మరణానికి కచ్చితమైన కారణం తెలుస్తుందని అన్నారు.