బ్యాంక్ ఆఫ్ బరోడా 2700 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 01.
పోస్టులు: 2700.
తెలంగాణ రాష్ట్రంలో 154 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఎస్సీ 26, ఎస్టీ 12, ఓబీసీ 49, ఈడబ్ల్యూఎస్ 18, అన్ రిజర్వ్డ్ 49, పీడబ్ల్యూబీడీ 7.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సమానమైన అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి (2025, నవంబర్ 1 వరకు): కనిష్ట వయోపరిమితి 20 ఏండ్లు. గరిష్ట వయోపరిమితి 28 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు ఫీజు లేదు. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.400. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.800.
లాస్ట్ డేట్: డిసెంబర్ 01.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్లైన్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాష్ట్ర స్థానిక భాషా ప్రావీణ్య పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
స్టైఫండ్: నియామక కాలంలో ప్రతి నెలా రూ.15,000 చెల్లిస్తారు.
ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్
ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు1 మార్కు. మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. గంటలో పూర్తిచేయాలి. జనరల్/ ఫైనాన్షియల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు 25 మార్కులకు, క్వాంటిటేటివ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 25 మార్కులకు, కంప్యూటర్ నాలెడ్జ్ 25 ప్రశ్నలు 25 మార్కులకు, జనరల్ ఇంగ్లిష్ 25 ప్రశ్నలు 25 మార్కులకు ఇస్తారు. నెగెటివ్ మార్కులు లేవు.
పూర్తి వివరాలకు bankofbaroda.bank.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
