ఏప్రిల్ నెలలో 14 రోజులు బ్యాంక్ హాలిడేస్.. ఎందుకంటే

ఏప్రిల్ నెలలో 14 రోజులు బ్యాంక్ హాలిడేస్.. ఎందుకంటే

2024-25 ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభ నెలలో బ్యాంకులకు సెలవులే సెలవులు. ఏప్రిల్ నెలలో ఏకంగా 14 రోజులపాటు బ్యాంకులు మూసివేయబడి ఉంటాయి. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంక్ హాలిడేస్ కు సంబందించిన లిస్ట్ ను విడుదల చేసింది. ఆర్బీఐ ప్రకారం ఏప్రిల్ లో మొత్తం 14 రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఈ సెలవులు పబ్లిక్ సెలవులు, రీజనల్, రెండవ, నాల్గవ శనివారాలు, అన్ని ఆదివారాలు కలుపుకొని మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. 

ఏప్రిల్ లో బ్యాంకులకు సెలవులు 

  • ఏప్రిల్ 1(సోమవారం )- బ్యాంకు వార్షిక ఖాతాలను మూసివేయడం 
  • ఏప్రిల్ 5-బాబూ జగ్జివన్రామ్ బర్త్ డే /జుమాత్ ఉల్ విదా )
  • ఏప్రిల్ 9-ఉగాది పండుగ
  • ఏప్రిల్ 10- రంజాన్-ఈద్ ఉల్ ఫితర్ 
  • ఏప్రిల్ 11-రంజాన్ -ఈద్ (ఈద్ ఉల్ ఫితర్ ) (1వ షావాల్) 
  • ఏప్రిల్ 13-బోహాగ్ బిహు/చీరోబా/బైసాకి/ బిజు పండుగ 
  • ఏప్రిల్ 15-బోహాగ్/హిమాచల్ డే 
  • ఏప్రిల్ 16- శ్రీరామనవమి
  • ఏప్రిల్ 20-గరియా పూజ

కాబట్టి కస్టమర్లు తమ సంబంధిత బ్యాంకులకు వెళ్లేందుకు సెలవులకు అనుగుణంగా ప్రణాళికలను మార్చుకోవాలని ఆర్బీఐ సూచించింది. యూపిఐ , ఇంటర్నెట్ బ్యాంకింగ్ తో పాటు ఇతర బ్యాంకింగ్ సౌకర్యాలు ఈ సెలవు దినాల్లో పనిచేస్తాయి.