దేశంలో బ్యాంకులు ఇప్పుడు సురక్షితం

దేశంలో బ్యాంకులు ఇప్పుడు సురక్షితం

న్యూఢిల్లీ: విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి పరారీలో ఉన్న నేరస్తుల ఆస్తులు అమ్మి బ్యాంకులు రూ.13,109.17 కోట్లను రికవరీ చేశాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌‌‌‌‌‌‌‌సభకు తెలిపారు.  ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అందించిన సమాచారం ప్రకారం జూలై 2021 నాటికి విజయ్ మాల్యా, నీరవ్ మోడీ  మెహుల్ చోక్సీల ఆస్తుల అమ్మకాల నుండి ఈ మొత్తం రికవరీ అయిందని ఆమె చెప్పారు. ఈ ఏడాదిలో జూలై 16 నాటికి మాల్యా  ఇతరులకు చెందిన ఆస్తుల అమ్మకం ద్వారా రూ.792 కోట్లు వచ్చాయని చెప్పారు.  ''గత ఏడు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు  దాదాపు రూ.5.49 లక్షల కోట్ల రికవరీని సాధించాయి. డిఫాల్టర్లు, దేశం విడిచి పారిపోయిన ఇటువంటి వ్యక్తుల ఆస్తుల అమ్మకం నుంచి వచ్చిన డబ్బు ఇది! అందుకే బ్యాంకులు ఇప్పుడు సురక్షితంగా ఉన్నాయి”అని ఆమె అన్నారు. ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌పై ఆమె స్పందిస్తూ.. వంటనూనెల వంటి నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.