గూడూరు, వెలుగు : పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత డిమాండ్లను నెరవేర్చేందుకు ముందుగా అగ్రిమెంట్ రాసి ఇచ్చిన అభ్యర్థికే ఓట్లు వేస్తామని గ్రామస్తులు బ్యానర్ ప్రదర్శించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మచ్చర్లలో సోమవారం కొందరు యువకులు అంబేద్కర్ విగ్రహం వద్ద డిమాండ్ల బ్యానర్ ను ప్రదర్శించారు. పంచాయతీలో సైడ్ డ్రైనేజీ, కోతుల బెడద, సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు వంటి సమస్యలను ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తానని అభ్యర్థి బాండ్ రాసి ఇవ్వాలని, ఆ తర్వాతే ఓట్లు వేస్తామని తేల్చిచెప్పారు. డబ్బుకు, మద్యానికి ఓటును అమ్ముకోవద్దని ఓటర్లను కోరారు.
