కోల్‌బెల్ట్/చెన్నూరు/కోటపల్లి, వెలుగు: మల్టీ జోన్1 పరిధిలో పనిచేస్తున్న పలువురు సీఐలు, ఎస్సైలను బదిలీ చేస్తూ ఐజీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. చెన్నూరు పట్టణ సీఐగా బన్సీలాల్ నియామకమయ్యారు. కోటపెల్లిలో విధులు నిర్వహించిన బన్సీలాల్ చెన్నూరుకు బదిలీ కాగా, చెన్నూరులో పని చేసిన దేవేందర్ రావు హైదరాబాద్ ఐజీ ఆఫీస్‌కు అటాచ్గా వెళ్లారు. కరీంనగర్ ట్రాఫిక్-2 సీఐగా పనిచేస్తున్న పర్స రమేశ్‌ను మందమర్రి సీఐగా నియమించారు. ఇక్కడ పనిచేస్తున్న శశిధర్‌రెడ్డిని బదిలీ చేస్తూ ఐజీకి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు.
మరోవైపు మందమర్రి టౌన్ఎస్సై రాజశేఖర్‌ను కోటపల్లికి బదిలీ చేయగా ఆయన స్థానంలో భూపాలపల్లి జిల్లాలో వీఆర్ జేఎస్‌లో ఉన్న గోపతి నరేశ్‌ను, రామకృష్ణాపూర్ఎస్సై ఎల్.భూమేశ్ని భూపాపల్లి జిల్లాకు ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన స్థానంలో జైపూర్ ఎస్సై శ్రీధర్‌ను ఇక్కడికి బదిలీ చేశారు. కోటపల్లి సీఐగా రసూరి కృష్ణ నియమితులయ్యారు.
