ఇంటర్ అమ్మాయిని కాపాడటం కోసం.. నీళ్ల ట్యాంకర్ ఎక్కిన మహిళా సబ్ కలెక్టర్ !

ఇంటర్ అమ్మాయిని కాపాడటం కోసం.. నీళ్ల ట్యాంకర్ ఎక్కిన మహిళా సబ్ కలెక్టర్ !

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా మహ్మద్ నగర్ మండలం బుర్గల్ గ్రామంలో  ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన స్రవంతి అనే ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని తరచూ ఫోన్ చూడటంతో పేరెంట్స్ మందలించారు. ఈ పరిణామంతో మనస్తాపం చెందిన స్రవంతి 60 అడుగుల ఎత్తు ఉన్న వాటర్ ట్యాంక్‌ పైకి ఎక్కింది. 

సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి సబ్ కలెక్టర్ కిరణ్మయి చేరుకున్నారు. సబ్ కలెక్టర్ డా. కిరణ్మయి స్వయంగా ట్యాంక్‌ పైకి ఎక్కి స్రవంతితో మాట్లాడారు. ఆమెకు నచ్చజెప్పారు. యువతిని ఓదార్చుతూ కౌన్సెలింగ్ నిర్వహించి, నమ్మకం కల్పించి, యువతిని సురక్షితంగా సబ్ కలెక్టర్, ఫైర్ సిబ్బంది కిందికి దించారు. పోలీసులు, గ్రామ పెద్దలు సమన్వయంతో వ్యవహరించారు. సబ్ కలెక్టర్ ధైర్య సాహసంపై ప్రశంసల జల్లు కురిసింది.