ముగిసిన బప్పి లహిరి అంత్యక్రియలు

ముగిసిన బప్పి లహిరి అంత్యక్రియలు

ముంబై : అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ బప్పి లహిరి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ముంబైలోని విలే పార్లే శ్మశానవాటికలో ఆయన కుమారుడు చితికి నిప్పంటించారు. బప్పి లహిరికి కడసారి నివాళులర్పించేందకు సన్నిహితులు, సినీ ప్రముఖులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 

బప్పి లహిరి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత నెలలో ఆయన ముంబైలోని క్రిటికేర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. సోమవారం హాస్పిటల్ నుంచి డిశ్చార్జి కాగా.. మంగళవారం రాత్రి శ్వాస సంబంధిత సమస్య తలెత్తింది. కుటుంబసభ్యులు వెంటనే హాస్పిటల్ కు తరలించగా.. రాత్రి 11.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. 

మరిన్ని వార్తల కోసం..

ఎవడెట్లపోయినా.. మీరు మాత్రం సల్లగుండాలె

ప్రముఖ కమెడియన్ ప్రదీప్ మృతి