త్వరలో మరిన్ని రెస్టారెంట్లు

త్వరలో మరిన్ని రెస్టారెంట్లు

హైదరాబాద్​, వెలుగు: దేశవ్యాప్తంగా ప్రస్తుతం తమకు 60 రెస్టారెంట్లు ఉన్నాయని, రెండుమూడేళ్లలో వీటి సంఖ్యను వందకు చేర్చుతామని  బార్బెక్యూ & గ్రిల్‌‌‌‌‌‌‌‌ బఫే రెస్టారెంట్‌‌‌‌‌‌‌‌ చెయిన్​ అబ్సల్యూట్‌‌‌‌‌‌‌‌ బార్బెక్యూస్‌‌‌‌‌‌‌‌ ప్రకటించింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని అత్తాపూర్​లో  13వ అవుట్​లెట్​ప్రారంభోత్సవం సందర్భంగా సంస్థ జీఎం (ఆపరేషన్స్​) దేవవ్రత మిశ్రా మీడియాతో మాట్లాడుతూ వైజాగ్‌‌‌‌‌‌‌‌,  విజయవాడలో త్వరలో మరో రెండు అవుట్‌‌‌‌‌‌‌‌లెట్లను మొదలుపెడతామని చెప్పారు.

 వీటితో కలిపి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే తమ అవుట్​లెట్ల సంఖ్య 15కు చేరుకోనుందని వివరించారు. అబ్సల్యూట్‌‌‌‌‌‌‌‌ బార్బెక్యూస్​లో 75కి పైగా విభిన్నమైన రుచులతో కస్టమర్లకు నోరూరించే వంటకాలను అందిస్తున్నామని వివరించారు.  ప్రస్తుతం ప్రారంభించిన రెస్టారెంటులో 130 మంది కూర్చోవచ్చని వివరించారు. తమ రెస్టారెంట్లలో నెలకు దాదాపు మూడు లక్షల మంది తింటున్నారని మిశ్రా వివరించారు