
వెరైటీ పేరుతో ఏదో ఒక కొత్త ప్రయోగం చేయడం ఇటీవలి కాలంలో బాగా ఎక్కువైపోయింది. ఫ్యాషన్, స్టైల్ పేరుతో ప్రమాదాలతో ఆడుకోవడం అలవాటుగా మారింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో బార్బర్ (Barber) హెయిర్ కటింగ్ (Hair Cutting) చేసిన విధానం చూస్తే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాల్సిందే. ఆ బార్బర్ కత్తెరతో కాకుండా మంటలతో ఓ కస్టమర్‌కు హెయిర్ కటింగ్ చేశాడు (Hair Cutting with Flames). ఏ మాత్రం తేడా వచ్చినా పెద్ద ప్రమాదం జరగడానికి ఆస్కారం ఉంది.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కస్టమర్‌కు బార్బర్ హెయిర్ కటింగ్ చేస్తున్నాడు. అయితే కటింగ్ కోసం కత్తెర కాకుండా మంటను ఉపయోగించాడు. దువ్వెనతో కస్టమర్ జుట్టును పట్టుకుని చాలా నైపుణ్యం ఉపయోగించి కాల్చేశాడు. కస్టమర్ తల చుట్టూ మంటలు రావడం ఆందోళనకరంగా అనిపించవచ్చుగానీ, కస్టమర్ జుట్టును నిప్పుతో స్టైలింగ్ చేయడంలో నైపుణ్యం ప్రదర్శించిన బార్బర్‌ను మాత్రం అభినందించాల్సిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది.
Barbers will do anything but cut hair these days pic.twitter.com/5AWQjYFElX
— non aesthetic things (@PicturesFoIder) February 15, 2024
విచ్చలవిడిగా పెరిగిపోయిన ఇంటర్ నెట్ సదుపాయం ఇప్పుడు ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చేసింది. సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి విషయాన్ని మన కళ్ల ముందుకి తెస్తుంది. ఇటీవల ఓ మంగలి డిఫరెంట్ స్టైల్ లో హెయిర్ కట్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. గ్యాస్ కట్టర్ తో వెంట్రుకలు కత్తిరించే సమయంలో కాస్త అటు ఇటుగా అయితే మాత్రం ప్రాణానికే ప్రమాదం. ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకోవద్దంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
వైరల్‌గా మారిన వీడియోలో, ఒక మంగలి తన దుకాణానికి వచ్చిన కస్టమర్ జుట్టును వినూత్న శైలిలో కత్తిరించాడు. కత్తెర, క్లిప్పర్లకు బదులుగా, బార్బర్లు నిప్పుతో జుట్టును కత్తిరిస్తున్నాడు. అతను చేస్తున్న హెయిర్ స్టైల్ చాలా బాగుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
వీడియో చూసిన నెటిజన్లు దాన్ని మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు. లైకులు, కామెంట్లు, షేర్లతో హోరెత్తిస్తున్నారు. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 16 లక్షల మందికి పైగా వీక్షించారు. కొందరు ఆ బార్బర్ ట్యాలెంట్‌ను ప్రశంసించగా.. మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. జుట్టును మంటలతో కాల్చితే వాసన రాదా.., ఇంత ప్రమాదకరంగా కటింగ్ చేయించుకోవడం వల్ల ఏంటి ఉపయోగం..., ఆ కస్టమర్ ధైర్యానికి హ్యాట్సాఫ్.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
మన తాతలు, తండ్రుల కాలంలో క్షురకులు అందరి జుట్టును ఒకే విధంగా కత్తిరించేవారు. ట్రెండ్ మారినా కొద్దీ బార్బర్స్ కూడా మారుతున్నారు. కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా రకరకాల స్టైల్లో హెయిర్ కట్ చేస్తున్నారు. ఈ రోజుల్లో సెలూన్లలో పోటీ పెరిగింది. కస్టమర్లను ఆకర్షించేందుకు బార్బర్‌లు వివిధ పద్ధతులను ఉపయోగిస్తున్నారు.