పెళ్లి వద్దని పారిపోయిండు.. 20కి.మీ. వెంబడించి లాక్కొచ్చిన యువతి

పెళ్లి వద్దని పారిపోయిండు.. 20కి.మీ. వెంబడించి లాక్కొచ్చిన యువతి

ఒక మహిళ తనను పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తి పారిపోతున్నాడని తెలుసుకుని దాదాపు 20 కి.మీ వెంబడించి మళ్లీ అతన్ని 'మండపం' వద్దకు తీసుకువచ్చింది. హైవోల్టేజీ డ్రామా తరహాలో చోటుచేసుకున్న ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జరిగింది.

బదౌన్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో మహిళ రెండున్నరేళ్లుగా శృంగార సంబంధం కొనసాగిస్తోంది. ఎట్టకేలకు, కుటుంబ సభ్యుల మధ్య చాలా చర్చల తర్వాత పెళ్లికి తేదీని నిర్ణయించారు. మే 21న భూతేశ్వర్ నాథ్ ఆలయంలో ఈ జంట వివాహానికి ముహూర్తం ఖరారు చేశారు. ఎంతసేపటికీ పెళ్లి కొడుకు మండపానికి చేరుకోకపోవడంతో వధువు కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. అప్పటికే పెళ్లికి సిద్ధంగా ఉన్న పెళ్లి కూతురు.. అతనికి ఫోన్ చేయగా అతను తన తల్లిని తీసుకురావడానికి బుదౌన్ కు వెళ్తున్నట్టు సాకు చెప్పాడు.

అది విన్న పెళ్లి కూతురు.. తనను పెళ్లి చేసుకోకుండా ఆ వ్యక్తి పారిపోతున్నాడని గ్రహించింది. ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా, బరేలీకి 20 కి.మీ దూరంలో ఉన్న భీమోరా పోలీస్ స్టేషన్ దగ్గర బస్సు ఎక్కుతుండగా ఆమె అతడిని వెంబడించి ఎట్టకేలకు పట్టుకోగలిగింది. ఆ తర్వాత ఇరు కుటుంబాల సమక్షంలో భీమోర ఆలయంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహ ప్రమాణం చేసే ముందు మార్గమధ్యంలో జరిగిన హైవోల్టేజీ డ్రామా సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది.