దీక్షకు దిగిన ఓయూ జేఏసీ నేతకు పరామర్శ

దీక్షకు దిగిన ఓయూ జేఏసీ నేతకు పరామర్శ

పద్మారావునగర్, వెలుగు: నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గాంధీ ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేస్తున్న ఉస్మానియూ యూనివర్శిటీ నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్​నాయక్​ను శిరీష అలియాస్ బర్రెలక్క బుధవారం పరామర్శించారు. దీక్షకు సంఘీభావం తెలిపారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్​ నాయకులు ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరారు. 

మోతీలాల్ నాయక్​కు ఏదైనా హాని జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. మోతీలాల్ నాయక్​మాట్లాడుతూ.. తాను ఓయూలో ఆమరణ దీక్ష చేస్తుండగా పోలీసులు తీసుకొచ్చి, గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారన్నారు. మూడు రోజులుగా ఎలాంటి ఆహారం తీసుకోలేదని, డాక్టర్లు ట్రీట్మెంట్ లో భాగంగా సెలైన్లు పెడుతున్నారని చెప్పారు. హాస్పిటల్​లోనూ దీక్ష కొనసాగిస్తున్నానన్నారు. అలాగే బుధవారం సాయంత్రం మోతిలాల్ నాయక్ ను బీఆర్ఎస్​నేత రాకేశ్​రెడ్డి పరామర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.