బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల చర్చలు విఫలం

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల చర్చలు విఫలం

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన రోజురోజుకూ వేడెక్కుతోంది. పలు డిమాండ్ల సాధనే లక్ష్యంగా విద్యార్థులు చేపట్టిన ఈ నిరసన నాలుగో రోజుకు చేరుకుంది. అయితే నిన్న  రాత్రి  డైరెక్టర్ సతీష్ కుమార్ తో విద్యార్థులు చర్చలు జరపగా అవి విఫలమైనట్టు తెలుస్తోంది. దీంతో ఉద్యమాన్ని కొనసాగించాలని విద్యార్థులు నిర్ణయించినట్టు సమాచారం. రాత్రి పదకొండు గంటల వరకు ఈ చర్చలు కొనసాగగా... ఫలితం మాత్రం ఏం లేకపోయింది. ఈ నేపథ్యంలో నాలుగో రోజూ ఉద్యమాన్ని  కొనసాగిస్తామని విద్యార్థులు వెల్లడించారు. ఇకపోతే ప్యాకల్టీ కొరత తీర్చాలని , రెగ్యులర్ వీసీని, అధ్యాపకులను నియమించాలని, ల్యాప్  ట్యాప్ లు ఇవ్వాలని, ల్యాబ్  లో వసతులు కల్పించాలని, మౌలిక వసతులు కల్పించాలని, మెస్  ను టెండర్ల ప్రకారం అప్పగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.