కొనసాగుతున్న బాసర విద్యార్థుల ఆందోళ

కొనసాగుతున్న బాసర విద్యార్థుల ఆందోళ

బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల ఆందోళన 6వ రోజుకు చేరింది. విద్యార్థులను శాంతింపజేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం బాసర ట్రిపుల్ ఐటీ ఏవోపై వేటు వేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆందోళన నేపథ్యంలో నిన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులతో చర్చించారు. అయితే చర్చలు సఫలం అయ్యాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొనగా, చర్చలు విఫలం అయ్యాయని విద్యార్థులు అంటున్నారు. ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఇవాళ కూడా ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు వెల్లడించారు. బాసర ట్రిపుల్ ఐటీకి సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ రావాలని పట్టుబడుతున్నారు. 2018 నుండి తమ డిమాండ్లను ప్రభుత్వం నాన్చుతూ వస్తుందని విద్యార్థులు ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ తమ డిమాండ్లపై లిఖితపూర్వకంగా హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామంటున్నారు విద్యార్థులు. కాగా, సోమవారం నుండి విద్యార్థులు క్లాసులకు వెళ్తారని మంత్రి వెల్లడించగా.. విద్యార్థులు మాత్రం ఆందోళన కొనసాగుతోందంటున్నారు. ప్రస్తుతం  విద్యార్థులు, ప్రభుత్వం మధ్య చర్చల్లో గందరగోళం ఏర్పడింది.