
బాసరకు భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో అమ్మవారి దర్శనానికి క్యూ కట్టారు. గోదావరిలో పుణ్యస్నానాలు చేసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తల్లిదండ్రులు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి మొక్కలు తీర్చుకుంటున్నారు. దీంతో అమ్మవారి దర్శనానికి 3 గంటలకు పైగా సమయం పడుతోంది. రద్దీ పెరగడంతో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు.