మంత్రి సబిత హామీ ఏమైంది ?

మంత్రి సబిత హామీ ఏమైంది ?

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఇంచార్జ్ వీసీ వెంకటరమణతో సమావేశం అయ్యారు. ట్రిపుల్ ఐటీకి ఇంచార్జ్ వైస్ ఛాన్సలర్ నియామకంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెగ్యులర్ వీసీని 4 వారాల్లో నియమిస్తామన్న మంత్రి సబిత హామీ ఏమైందని ఇంచార్జ్ వీసీని ప్రశ్నించారు. 12 డిమాండ్లల్లో కేవలం ఐదింటిని మాత్రమే నెరవేర్చారని... ప్రధాన డిమాండ్లను పక్కన పెట్టారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. రెగ్యులర్ వీసీని 4 వారాల్లో నియమిస్తామన్న మంత్రి సబితా హామీతో గతనెల స్టూడెంట్స్ నిరసన విరమించిన సంగతి తెలిసిందే. ఈనెల 22న సెమిస్టర్ ఎగ్జామ్స్ ముగిశాక సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. క్యాంపస్ లో మళ్లీ పాయిజన్ జరిగి వందల మంది విద్యార్థులు హాస్పిటల్ పాలవడంపై ఆందోళన చేస్తున్నారు. స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో డైరెక్టర్ ఆఫీస్ ముట్టడించారు. తమ డిమాండ్లతో కూడిన లేఖను డైరెక్టర్ కు ఇచ్చారు. 

7 రోజుల డెడ్ లైన్ పెట్టారు. ఫుడ్ పాయిజన్ తో ఆందోళన చెందుతున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు క్యాంపస్ ను ఖాళీచేసి ఇంటికి వెళ్తున్నారు. దాదాపు 6 వందల మంది విద్యార్థులు ఔట్ పాసులు తీసుకుని.. ఇంటికి వెళ్లిపోయారు. పేరెంట్స్ కూడా విద్యార్థులను ఇంటికి తీసుకెళ్తున్నారు. ఫుడ్ పాయిజన్ ఘటన బాధాకరమని ట్రిపుల్ ఐటీ డెరెక్టర్ సతీశ్ కుమార్ తెలిపారు. పిల్లలంతా రికవరీ అయ్యారని.. ఇకపై ప్రతి మెస్ కి, హాస్టల్ కి వార్డెన్ లు ఉంటారన్నారు. ప్రతిరోజు పిల్లలతో పాటు.. ఇద్దరు టీచర్లు భోజనం చేసేలా నిబంధన పెట్టామన్నారు. మెస్ కమిటీలో స్టూడెంట్లకు చోటు కల్పించి సలహాలు సూచనలు తీసుకుంటామన్నారు. వారం తర్వాత ట్రిపుల్ ఐటీలో మరోసారి సమీక్ష చేస్తామన్నారు.