బాసర ట్రిపుల్ ఐటీలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన

బాసర ట్రిపుల్ ఐటీలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన రెండో రోజు కొనసాగుతుంది. ట్రిపుల్ ఐటీలో సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ విద్యార్థులు నిరసనకు దిగారు.  రెగ్యులర్ వీసీ లేకపోవడం, ఫ్యాకల్టీ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతునామని చెబుతున్నారు. నాసిరకం భోజనం వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక సీఎం కేసీఆర్ లేదా కేటీఆర్ కాలేజీని సందర్శించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు నిరసన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. విద్యార్థులకు మద్ధతుగా ఆందోళనలో పాల్గొనడానికి వచ్చిన తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

కాగా విద్యార్థుల సమస్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్దికి తాము కృషి చేస్తున్నామని తెలిపారు. బాసర ఆర్జీయూకేటీ విద్యార్థుల లేవనెత్తిన అన్ని అంశాలను సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు, విద్యార్థులు ఆందోళన చెందవద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.