ఏడో రోజుకు చేరిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన

ఏడో రోజుకు చేరిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల శాంతియుత ఆందోళన కంటిన్యూ అవుతోంది.. స్టూడెంట్స్ నిరసనలు ఇవాళ్టికి ఏడో రోజుకు చేరాయి. ఇక నుంచి 24 గంటల పాటు శాంతియుత నిరసనలు తెలపాలని స్టూడెంట్స్ డిసైడ్ అయ్యారు. రాత్రంతా క్యాంపస్ మెయిన్ రోడ్లపైనే పడుకుని విద్యార్థులు నిరసన తెలిపారు. నిన్న విద్యార్థులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ట్రిపుల్ ఐటీ డైరెక్టర్, నిర్మల్ జిల్లా కలెక్టర్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వీసీ నియామక ప్రక్రియను ప్రభుత్వం మొదలు పెట్టిందని తెలిపారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం నుంచి నోటి మాటగా కాకుండా, లిఖిత పూర్వక హామీకి విద్యార్థులు పట్టుబడుతున్నారు. అలాగే సీఎం కేసీఆర్ బాసర ట్రిపుల్ ఐటీ వచ్చి సమస్యలు పరిశీలించాలని కోరుకుంటున్నారు. 

బాసర ట్రిపుల్ ITలో సమస్యలు ఎక్కడివక్కడే అన్నట్లుగా ఉన్నాయని, కనీస వసతులు కరువయ్యే పరిస్థితి ఉందని అంటున్నారు. రెగ్యులర్ గా నిధుల విడుదల జరగడం లేదని, అధికారులు, రెగ్యులర్ అధ్యాపకుల నియామకం వెంటనే  చేపట్టాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు 10 వేల మంది పూర్వ విద్యార్థులు కూడా మద్దతు ప్రకటించారు. మరోవైపు ఆందోళనలు ఇలాగే కంటిన్యూ అయితే ట్రిపుల్ ఐటీకి సెలవులు ఇచ్చే ఆలోచనతో ప్రభుత్వం ఉంది.