సంస్కృతి, సంప్రదాయాలతో ఖమ్మం జిల్లాలో బతుకమ్మ వేడుకలు

సంస్కృతి, సంప్రదాయాలతో ఖమ్మం జిల్లాలో బతుకమ్మ  వేడుకలు

భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం/పాల్వంచ, వెలుగు : సంస్కృతి, సంప్రదాయాలతో బతుకమ్మ  వేడుకలు మొదలయ్యాయి. ఆడపడుచులు శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పండుగ చేసుకున్నారు. చిన్నారుల కోలాహలం, యువతుల ఆటపాటలు, ఆడపడుచుల సందడితో  సంబురాలు అంబరాన్నంటాయి.  తంగేడు, గునుగు, టేకు, గుమ్మడి, కలువ, బంతి పూలతో బతుకమ్మలను తయారు చేసి గౌరమ్మను పెట్టి పూజించారు.  పలుచోట్ల డీజే సౌండ్స్​ కు అనుగుణంగా కోలాటాలతో బతుకమ్మ  ఆడారు.

కొత్తగూడెంతో పాటు ఇల్లెందు, మణుగూరు, పాల్వంచ, టేకులపల్లి, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, ముల్కలపల్లి, అశ్వారావుపేట తదితర ప్రాంతాల్లో  వేడుకలను నిర్వహించారు. కొత్తగూడెంలో జీఎస్సాఆర్​ ట్రస్ట్​ ఆధ్వర్యంలో అందమైన బతుకమ్మలకు రోజుకో పట్టుచీరను బహుమతులుగా అందజేస్తున్నారు. జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్య టేకులపల్లి మండలంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు.