రెండు పార్టీలు ఒక్కటై..బీసీల నోటికాడి ముద్ద లాక్కున్నయ్: భట్టి విక్రమార్క

రెండు పార్టీలు ఒక్కటై..బీసీల నోటికాడి ముద్ద లాక్కున్నయ్: భట్టి విక్రమార్క

బీసీ బిల్లును ఆపుతుంది బీజేపీ,బీఆర్ఎస్సేనని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.బీసీలకు మేలు జరుగుతుంటే బీజేపీ, బీఆర్ఎస్ లు ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ చేసిన చట్టమే బీసీలకు ఉరితాడుగా మారిందన్నారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని చట్టం తెచ్చింది కేసీఆరేనన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రల వల్లే బీసీలకు అన్యాయం జరిగిందన్నారు భట్టి.

గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన భట్టి.. హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత మా ఆలోచన చెప్తాం.  రాష్ట్రంలో శాస్త్రీయంగా సర్వే నిర్వహించాం.  రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని బీఆర్ఎస్ చట్టం చేసింది. గతంలో బీఆర్ఎస్ చేసిన చట్టం ఓబీసీలకు ఉరితాడుగా మారింది.  బీజేపీ, బీఆర్ఎస్ లకు చిత్తశుద్ది లేదు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పిటిషన్ పై ఎందుకు ఇంప్లీడ్ కాలేదు.  బీసీల నోటికాడ ముద్దను లాక్కున్నాయి. పక్కా లెక్కలతో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాం. దుష్టులు,దుర్మార్గులు అడ్డుకున్నా సర్వే పక్కాగా చేశాం.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం.  బీఆర్ఎస్, బీజేపీ బీసీ వ్యతిరేకులు. బీసీలు అమాయకులు కాదు అన్నీ గమనిస్తున్నారు.  సైంటిఫిక్ సర్వే చేసి బిల్లు చేశాం. రిజర్వేషన్లను అడ్డుకుంది బీజేపీ,బీఆర్ఎస్సే. బీసీ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. బీజేపీ ఆధ్వర్యంలోనే కేంద్రం బిల్లును ఆపుతోంది.  ప్రభుత్వం బిల్లు పాస్ చేసి పంపితే గవర్నర్ ఎందుకు ఆమోదించరు.. మేం గవర్నర్ కు పంపి ఆరు నెలలు అవుతుంది. బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం అని అన్నారు .