సింగపూర్, జర్మనీలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

సింగపూర్, జర్మనీలో ఘనంగా  బతుకమ్మ సంబురాలు

ఆస్ట్రేలియా మెల్ బోర్న్ లో బతుకమ్మ సంబరాలు గ్రాండ్ గా జరిగాయి. ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ INC ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళలు బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలతో  నిర్వహించిన వేడుకల్లో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. చిన్నా, పెద్దా అందరూ కలిసి బతుకమ్మ చుట్టూ చేరి ఆడిపాడారు.

సింగపూర్ లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. తెలుగువాళ్లంతా కలసి గార్డెన్ హౌస్, జురాంగ్ లేక్ గార్డెన్ లో పండగను వైభవంగా జరుపుకున్నారు. మహిళలు రంగు రంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు. చిన్నారులు, మహిళలు బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు.  

జర్మనీ మ్యూనిచ్ నగరంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. అక్కడ స్థిరపడిన తెలంగాణ బిడ్డలు..తీరొక్క పూలతో బతుకమ్మలను  పేర్చి ఆడిపాడారు. మహిళలు, చిన్నారులు సంబురాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను మరవకుండా బతుకమ్మ పండగ జరుపుకోవడం సంతోషంగా ఉందని నిర్వాహాకులు అన్నారు. కార్యక్రమంలో నిర్వాహాకులు వైద్యల మానస మహేష్, గంత అరవింద్, మేసినేని సుష్మ నరేశ్, ఇతరులు పాల్గొన్నారు.