బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్: కేపీహెచ్బీ కాలనీలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.  కాలనీలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం వద్ద జరిగిన ఈ ఉత్సవాల్లో తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు బతుకమ్మ, కోలాటం ఆడారు. ఈ సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా నేతలు మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఈ బతుకమ్మ పండుగ ప్రతీక అని అన్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మ తో ఈ వేడుకలు ముగుస్తాయని చెప్పారు.

రాష్ట్ర పండుగలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని... బతుకమ్మ, దసరా పండుగలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించిన మహిళా మోర్చా నాయకురాళ్లకు స్థానిక మహిళలు ధన్యవాదాలు తెలిపారు.