ట్యాంక్ బండ్ తీరాన కనులవిందుగా పూల పండుగ

ట్యాంక్ బండ్  తీరాన కనులవిందుగా పూల పండుగ

బతుకమ్మ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడో రోజు శనివారం వేపకాయల బతుకమ్మను నగరంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ట్యాంక్​బండ్​ తీరాన మెట్రో పాలిటన్  డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్ ఎండీ ఏ) ఆధ్వర్యంలో కార్నివాల్​ పేరుతో నిర్వహించిన ఉత్సవాలు కనువిందు చేశాయి. 

ట్యాంక్​బండ్​ పరిసరాలను వివిధ రకాల బతుకమ్మ డిజైన్​లతో అందంగా ముస్తాబు చేశారు. సంప్రదాయ నృత్యాలు, జానపదాలు, నాటికలు ఆకట్టుకున్నాయి. హుస్సేన్ సాగర్‌లో రంగురంగుల కాంతులతో తేలియాడిన బతుకమ్మ స్పెషల్​ అట్రాక్షన్​గా నిలిచింది. వివిధ రకాల తెలంగాణ వంటకాలతో ఫుడ్​ స్టాళ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు నగర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో బతుకమ్మ జోష్​ కొనసాగింది.