బతుకమ్మ చీరల కూలీ పెంచాలంటూ కార్మికుల నిరసన

బతుకమ్మ చీరల కూలీ పెంచాలంటూ కార్మికుల నిరసన

రాజన్న సిరిసిల్లా జిల్లా: బతుకమ్మ చీరల తయారీ కూలీ రేట్లు పెంచాలంటూ 3వ రోజు పవర్ లూం కార్మికులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. 3 రోజులుగా చీరల తయారీ నిలిపివేసిన నేతన్నలు… ఇవాళ సీఐటీయూ అధ్వర్యంలో కలెక్టరేట్ ముందు బైటాయించారు. లోపలికి చొచ్చుకుని వెళ్ళేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు కార్మికులు. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది.
బతుకమ్మ చీరల కూలీ రేట్లు పెంచేంత వరకు మరమగ్గాల సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు కార్మికులు. తమ సమస్యలను యాజమాన్యం, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.