
తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో భాగంగా ఏడవ రోజు ( september 27) వేపకాయల బతుకమ్మ అందరి ఇళ్లలో సందడి చేస్తుంది. వేపచెట్టు అంటే ఆ ఆదిపరాశక్తికి ప్రతిరూపం. ఆ ఆదిపరాశక్తికి నీరాజనాలు అర్పిస్తూ వేపకాయల బతుకమ్మను ఆరాధిస్తారు. తెలంగాణలో శక్తి స్వరూపంగా ఎల్లమ్మ దేవతను ఎంతో భక్తి పారవశ్యంతో పూజలు చేస్తారు.
తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో భాగంగా ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ అందరి ఇళ్లలో సందడి చేస్తుంది. ఆశ్వయుజ శుద్ధ షష్ఠి (మంగళవారం) నాడు వేపకాయ బతుకమ్మను పేర్చుతారు. ఈరోజు ( september 27) బియ్యం పిండిని వేయించి, బెల్లం కలిపి వేపకాయ ఆకారంలో చేసిన వంటను గౌరమ్మకు నివేదిస్తారు. ఈ విధంగా చేస్తారు కాబట్టే ఈరోజు వేపకాయ బతుకమ్మ అనే పేరు వచ్చింది.
వేపచెట్టు అంటే ఆ ఆదిపరాశక్తికి ప్రతిరూపం. ఆ ఆదిపరాశక్తికి నీరాజనాలు అర్పిస్తూ వేపకాయల బతుకమ్మను ఆరాధిస్తారు. తెలంగాణ లో శక్తి స్వరూపంగా ఎల్లమ్మ దేవతను ఎంతో భక్తి పారవశ్యంతో పూజించడం అందరికి తెలిసినదే.
►ALSO READ | Agriculture: పంజాబ్ రైతుల వినూత్న పద్దతి..వరిపంటలకు 40 శాతం నీటివాడకం తగ్గించొచ్చు
వేపకాయల బతుకమ్మ పండుగరోజు చామంతి, గునుగు, తంగేడు, గులాబీ పూలతో ఏడవరోజును ప్రతిబింబించేలా ఏడు అంతరాలలో బతుకమ్మను పేరుస్తారు. అలాంటి ఆదిపరాశక్తికి పూజిస్తూ వేపకాయల బతుకమ్మను మహిళలు ఆరాధిస్తారు.సకినాలను తయారుచేయడానికి ఉప యోగించే పిండితో చిన్న వేపపండ్లు ఆకారంలో చిన్న ముద్దలు చేసి వాటిని బతుకమ్మకు పెడతారు. అలాగే నైవేద్యంగా బెల్లం, పప్పు కూడా నైవేద్యంగా సమర్పిస్తారు.
తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పూలు మాత్రమే పూజించే పండుగ బతుకమ్మ పండుగ. ఈ పండుగ అచ్చమైన ఆడబిడ్డల పండుగ. అశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తీరోక్క బతుకమ్మలను తయారు చేసి రకరకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తారు. ఆడబిడ్డలందరూ మెట్టినింటి నుంచి పుట్టింటికి వచ్చి సంతోషంగా బతుకమ్మ పండుగ జరుపుకుంటారు.
సాయంత్రం కాగానే బతుకమ్మను ఇంటి ముంగిట్లో పెడతారు. ఆ తరువాత ఆ వీధి ఆడవాళ్లు అందరూ ప్రతి ఇంట్లో ఉన్న తమ బతుకమ్మలను తీసుకొచ్చి ఒకచోట పెట్టి తమ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పాటలను పాడుతూ, చప్పట్లు కొడుతూ సందడి చేస్తారు.ఆ తరువాత అందరూ ఎవరి బతుకమ్మను వాళ్ళు తలకెత్తుకుని నీళ్లున్న ప్రాంతాలైన, చెరువులు, కాలువలు వంటి చోటుకు వెళ్లి బతుకమ్మలను నీళ్లలో వదులుతారు. బతుకమ్మకు పెట్టిన నైవేద్యాన్ని అందరూ పంచుకుని తిని .. ఇంటికి వెళ్లి ఇంటిల్లిపాదికి కూడా పంచి పెడతారు. అలా ఏడవరోజు ఏడు తరాల బతుకమ్మ గంగమ్మ ఒడిలోకి చేరడంతో వేపకాయల బతుకమ్మ సందడి ముగుస్తుంది.
చిక్కుడు వాకిట్లో.. సిరి సద్దులు కట్టి బతుకమ్మ పాటకు లిరిక్స్
చిక్కుడు వాకిట్లో ఉయ్యాలో
సిరి సద్దులు కట్టి ఉయ్యాలో
పోదాము చిత్తూరు ఉయ్యాలో
చుట్టాల జూడ ఉయ్యాలో
ఆడెవరున్నారె ఉయ్యాలో
ఓ బుజ్జి బంతి ఉయ్యాలో
అమ్మకు తముళ్లు ఉయ్యాలో
మనకు మామలు ఉయ్యాలో
బావ బామ్మర్దులు కలిసి ఉయ్యాలో
బావి తోడిచ్చే ఉయ్యాలో
బావిలో ఉన్నదీ ఉయ్యాలో
బంగారు బిందె ఉయ్యాలో
బిందెల ఉన్నదీ ఉయ్యాలో
పట్టె మంచం ఉయ్యాలో
పట్టె మంచం మీద ఉయ్యాలో
తొండూరి పరుపు ఉయ్యాలో
తొండూరి పరుపు మీద ఉయ్యాలో
ఇంద్రుని మెత్త ఉయ్యాలో
ఇంద్రుని మెత్త మీద ఉయ్యాలో
శివుడొచ్చి ఒరిగే ఉయ్యాలో
శివుడి కాళ్ల కాడ ఉయ్యాలో
గౌరమ్మ గంగమ్మ ఉయ్యాలో
గౌరమ్మ గంగమ్మ ఉయ్యాలో
గవ్వలాడంగ ఉయ్యాలో
అక్కడ మెరిసే ఉయ్యాలో
గుండంల మెరిసే ఉయ్యాలో
గుండంల నీళ్లన్ని ఉయ్యాలో
కుంకుమలాయే ఉయ్యాలో
కుంకుమ జోడించి ఉయ్యాలో
కుప్పలే పోయించి ఉయ్యాలో
రాలిన కుంకుమ ఉయ్యాలో
రాశులె నోయించి ఉయ్యాలో
మిగిలిన కుంకుమ ఉయ్యాలో
మిద్దె కట్టించే ఉయ్యాలో
ముద్దలా ఈరన్నకు ఉయ్యాలో
ఏమేమి సొమ్ములు ఉయ్యాలో
కాకరకాయ కోయంగా ఉయ్యాలో
కాళ్ళ కడియాలు ఉయ్యాలో
మునగకాయ కోయంగా ఉయ్యాలో
ముక్కుకు ముక్కెర ఉయ్యాలో
పెసరకాయ కోయంగా ఉయ్యాలో
పెయినిండ సొమ్ములు ఉయ్యాలో