బీసీ రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలు నిర్వహించాలి : బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశ్గౌడ్

బీసీ రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలు నిర్వహించాలి : బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశ్గౌడ్

బషీర్​బాగ్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను ఉపసంహరించుకొని , బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశ్​గౌడ్ విజ్ఞప్తి చేశారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఆయన మాట్లాడారు. 

బీసీ  రిజర్వేషన్లపై హైకోర్టులో సోమవారం వాదనలు ఉన్నప్పటికీ ప్రభుత్వం హడావుడిగా జీవోను తీసుకురావాల్సిన అవనరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్సీ, బీసీలకు కలిపి 50 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించడం బీసీలను మోసం చేయడమేనన్నారు.